English | Telugu
Nikhil Nair Remuneration: నిఖిల్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Updated : Nov 17, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు నిఖిల్ నయ్యర్. అతడిని చూడగానే అందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే హైట్ కి హైట్ అండ్ ఫిజిక్ కి ఫిజిక్ ఉంది. ఇక టాస్క్ లలో ఇతడిని కొట్టేవారు ఉండరని అనుకున్నారంతా కానీ అవేమీ జరగలేదు.
హౌస్ లో ఇతడికి పాజిటివ్ గా ఉండే ఒక్క గేమ్ రాలేదు. దాంతో పాటు ఇతడు కామ్ అండ్ కూల్ గా ఉండటంతో ఎక్కువ కంటెంట్ ఇవ్వలేకపోయాడు. అయితే, అతడికి వారానికి రెండు లక్షల యాభై వేల మేరకు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం. ఈ లెక్కన ఐదువారాలకు గానూ పన్నెండు లక్షల అయిదు వేల రూపాయల మేరకు సంపాదించాడు.
నిఖిల్ నయ్యర్ కి తెలుగు బుల్లితెరపై మంచి ఫేమ్ ఉండటంతో రెమ్యునరేషన్ బాగానే ఇచ్చారు. గృహలక్ష్మి సీరియల్లో ప్రేమ్ పాత్రలో నిఖిల్ నాయర్ ప్రతి ఒక్కరినీ అలరించారు. నిఖిల్ ఎలిమినేట్ అయి స్టేజ్ మీదకి రాగానే నాగార్జున ప్రశంసించాడు. చాలా బాగా ఆడావని నాగార్జున అన్నాడు. ఆ తర్వాత అతడి జర్నీ వీడియో చూపించగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు నిఖిల్.