English | Telugu

ప్రభాస్‌కి డేట్ ఇస్తాను.... డ్రగ్స్ లేకుండా చేస్తాను!

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్న జ్యోతి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాప్ హీరోస్ నటించిన ఎన్నో మూవీస్ లో సైడ్ రోల్స్ లో, వాంప్ రోల్స్ లో నటించింది. అలాగే బిగ్ బాస్ సీజన్ 1 లో కంటెస్టెంట్ గా కూడా వెళ్ళింది. ఇక ఇప్పుడు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పుకొచ్చింది. "ఇప్పుడు నేను హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నాను. అది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది." అని చెప్పింది. "నేను వన్ డే సిఎం ఐతే డ్రగ్స్ ని పర్మనెంట్ గా, కంప్లీట్ గా లేకుండా చేస్తాను. నా ఫ్రెండ్స్ డ్రగ్స్ బారిన పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నా మనసుకు చాలా దగ్గరి వాళ్ళు. డ్రగ్స్ కి ఎడిక్ట్ ఐపోయి వాళ్ళేం చేస్తున్నారో కూడా వాళ్ళకే తెలియని పొజిషన్ లో ఉండేవాళ్ళు. అందుకే డ్రగ్స్ లేకుండా చేస్తా" అని చెప్పింది.

తర్వాత "ఇన్నాళ్లు ఉన్నారు కదా ఇండస్ట్రీ మీకు ఎం నేర్పించింది" అని అడిగింది హోస్ట్. "సహనంతో ఉండాలని నేర్పింది. ఒక వేళా నేను ఆర్టిస్ట్ ని కాకపోయి ఉంటే పైలెట్ ని అయ్యుండేదాన్ని." అని చెప్పింది. ఫైనల్ గా "ఒకటే రోజు, ఒకటే టైం, ఒకటే డేట్ లో విజయ్ దేవరకొండ, ప్రభాస్ తో చేయాలి అంటే డేట్ ఎవరికీ ఇస్తారు" అని అడిగేసరికి "ప్రభాస్ కి డేట్ ఇస్తాను. విజయ్ దేవరకొండతో కిస్, క్రష్ మాత్రమే కదా చెప్పాను వర్క్ చేస్తాను అని చెప్పలేదు కదా. అప్పుడు ఇద్దరితో కలిసి పని చేసినట్టు ఉంటుంది" అంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చింది నటి జ్యోతి. ఇక రీసెంట్ గా ఈమె తన కొడుకుతో కలిసి కొత్త ఇంటి గృహప్రవేశం చేసింది. ఆ వీడియోస్ ని పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.