English | Telugu
బిగ్ బాస్ నేహ పెళ్లి గోల మొదలయ్యింది!
Updated : Nov 21, 2022
సెలబ్రిటీస్ పెళ్లి విషయం సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఇక ఇప్పుడు తాజాగా నేహా చౌదరి పెళ్లి పీటలెక్కబోతున్నట్టు తానే స్వయంగా చెప్పింది. బిగ్ బాస్ ద్వారా మంచి ఫేమ్ తెచ్చుకున్న సెలబ్రిటీస్ లో యాంకర్ నేహా చౌదరి కూడా ఒకరు. ఒక వైపు టీవీ షోస్ తో పాటు గేమ్స్ కి సంబంధించిన ప్రోగ్రామ్స్ కి కూడా హోస్ట్ గా చేస్తుంటుంది.
ఇక ఫైనల్ గా తనకు పెళ్లి కాబోతోంది అంటూ ఒక వీడియోలో అనౌన్స్ చేసింది . అంతేకాదు పెళ్లిచేసుకోబోయే వరుడిని కూడా అందరికీ పరిచయం చేసింది. తన పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకుని మరీ బిగ్ బాస్ హౌస్ కి వచ్చినట్లు సీజన్ 6 స్టార్టింగ్ లో చెప్పింది. ఇక ఇప్పుడు నేహా తన పెళ్లి వార్తను ఫ్రెండ్స్ సమక్షంలో అనౌన్స్ చేసేసింది. ఆమె ఫ్రెండ్స్ ఎవరంటే యాంకర్ ప్రశాంతి, సింగర్ లిప్సిక, ఆర్జే కాజల్, అభిరుచి యాంకర్ గీతాసౌజన్య తదితరులు వచ్చారు.
ఇక నేహా తనకు కాబోయే భర్త పేరు అనిల్ అని,13 ఏళ్లుగా తాము మంచి ఫ్రెండ్స్ గా ఉన్నాం అని, ఇక ఇప్పుడు ఆ ఫ్రెండ్ షిప్ కాస్త రిలేషన్ షిప్ లోకి వెళ్ళబోతున్నట్లు చెప్పింది. ‘నా పెళ్లి గోల మొదలైంది’ అనే పేరుతో "అలా నేహాతో" అనే తన యూట్యూబ్ లో ఈ వీడియోని పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ నేహాకు కంగ్రాట్స్ చెబుతున్నారు.