English | Telugu

'శూర్ప‌ణ‌ఖా నీ ముక్కు కోసేస్తా'.. బిందుమాధ‌విపై న‌ట‌రాజ్ వీరంగం

బిగ్‌బాస్ నాన్ స్టాప్ షో రస‌వ‌త్త‌రంగా మారింది. మ‌రికొన్ని రోజుల్లో గ్రాండ్ ఫినాలే జ‌ర‌గ‌బోతోంది. ఈ నేప‌థ్యంలో ఫైన‌ల్ కు చేరుకునేది ఎవ‌రు? అనే ఆస‌క్తి స‌ర్వ‌త్రా నెల‌కొంది. ప్ర‌స్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో అరియానా, బిందు మాధ‌వి, న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌, మిత్ర‌, యాంక‌ర్ శివ‌, అఖిల్‌, అనిల్‌, బాబా భాస్క‌ర్‌ మాస్ట‌ర్ ఉన్నారు. ఇందులో ఎవ‌రు ఫినాలేకు చేరుకోవ‌డానికి అర్హులో.. ఏ ముగ్గురు అన‌ర్హులో చెప్పాలంటూ బిగ్ బాస్ హౌస్ మేట్ ల‌కు టాస్క్ ఇచ్చారు. ఇదే ఇంటి సభ్యుల‌ మ‌ధ్య తీవ్ర చిచ్చుకు కార‌ణంగా నిలిచింది. బిగ్ బాస్ ఆదేశాలు ఇచ్చాడో లేదో వెంట‌నే రంగంలోకి దిగాడు న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌.

ఈ క్ర‌మంలో అరియానా, బిందు మాధ‌వి, బాబా భాస్క‌ర్ ఫినాలేకు చేరుకోవ‌డానికి అన‌ర్హుల‌ని తేల్చేశాడు. ఇక్క‌డి నుంచే అస‌లు ర‌చ్చ మొద‌లైంది. ఇందుకు సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది. ఈ టాస్క్ లో బిందు మాధ‌విని న‌ట‌రాజ్ మాస్ట‌ర్ టార్గెట్ చేయ‌డం క‌నిపించింది. 'నెగిటివిటి మాత్ర‌మే వున్న ఏకైక ప‌ర్స‌న్ నువ్వు మాత్ర‌మే' అంటూ ర‌చ్చ చేశాడు. దీనికి బిందు గ‌ట్టి కౌంట‌రే ఇచ్చింది. 'నీ సైడ్ వ‌చ్చింది పాజిటివా?' అంటూ షంటింది. 'నీ బెస్ట్ గేమ్ ఏంటీ?' అని న‌ట‌రాజ్ మాస్ట‌ర్ అడిగితే.. 'ఐయామ్ ది మోస్ట్ స్ట్రాంగెస్ట్ ప‌ర్స‌న్ ఇన్ దిస్ హౌస్' అని చెప్పింది బిందు.

దీంతో ఇద్ద‌రి మ‌ధ్య మాట‌ల యుద్ధం మొద‌లైంది. 'నీ బండారం బ‌య‌ట‌పెడ‌తా' అంటూ కెమెరా వైపు చూస్తూ న‌ట‌రాజ్ వెకిలి వేషాలు వేయ‌డం మొద‌లు పెట్టాడు. దీంతో బిందు ఆది ప‌రాశ‌క్తిగా ఫోజు పెట్టి నిల‌బ‌డింది. దీనికి కౌంట‌ర్ ఇస్తూ న‌ట‌రాజ్ 'శూర్ప‌ణ‌ఖ నీ టైమ్ అయిపోయింది. ఇదిగో ల‌క్ష్మ‌ణ బాణం.. నీ ముక్కు కోసేస్తా' అంటూ వీరంగం వేశాడు. ఆ త‌రువాత అఖిల్ - శివ, అఖిల్ - బిందు మాధ‌వి, న‌ట‌రాజ్ - బాబా భాస్క‌ర్ ల మ‌ధ్య ఇదే త‌ర‌హాలో మాట‌ల యుద్ధం జ‌రిగింది.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.