English | Telugu

య‌ష్ - వేద‌ల ఇంట్లో నిధి అంత్యాక్ష‌రి క‌చేరి

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. గ‌త కొన్ని వారాలుగా ప్ర‌సాం అవుతున్న ఈ సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఓ పా కోసం ఓ యువ‌తి ప‌డే ఆరాటం నేప‌థ్యంలో ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్‌, మిన్ను నైనిక కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల‌లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, ఆనంద్‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, మీనాక్షి త‌దిత‌రులు న‌టించారు. హిందీ సీరియ‌ల్ ఆధారంగా ఈ సీరియ‌ల్ ని రీమేక్ చేశారు. బుధ‌వారం ఎపిసోడ్ విశేషాలేంటో ఒక‌సారి చూద్దాం.

య‌ష్ బిజినెస్ పార్ట్న‌ర్ దామోద‌ర్ త‌న సోద‌రి నిధిని య‌ష్ సోద‌రుడు వ‌సంత్ కిచ్చి పెళ్లి చేయాల‌ని చెబుతాడు. ఇందు కోసం నిధిని య‌ష్ ఇంటికి గెస్ట్ గా పంపిస్తాడు. గెస్ట్ గా య‌ష్ - వేద‌ల ఇంట సంద‌డి చేయ‌డం మొద‌లు పెట్టిన నిధి.. త‌న ప‌నుల‌తో వ‌సంత్ - చిత్ర ల మ‌ధ్య మంట పెడుతూ వుంటుంది. ఇంక త‌న కోస‌జం వంట ప్రిపేర్ చేయ‌మ‌ని ఆ బాధ్య‌త‌ల్ని య‌ష్ .. వేద‌కు అప్ప‌గిస్తాడు. ఉల్లిపాయ‌లు కోస్తూ ఏడుస్తున్న‌ట్టుగా క‌ల‌రింగ్ ఇస్తుంది వేద‌. అది నిజ‌మే అనుకుని య‌ష్ ఆ ప‌ని తానే చేస్తానంటాడు. స్పెట్స్ పెట్టుకుని ఉల్లిపాయ‌లు క‌ట్ చేస్తాడు.

ఆ త‌రువాత ఇద్ద‌రు క‌లిసి వెజిటేరియ‌న్ కోసం అంతా రెడీ చేయ‌బోతున్న స‌మ‌యంలో నిధి త‌న‌కు వెజిటేరియ‌న్ కాదు.. నాన్ వెజ్ కావాలంటుంది. అది విని వేద బావురుమంటుంది. అది గ‌మ‌నించిన య‌ష్ త‌న‌కు నీ విష‌యం తెసుస‌ని, నాన్ వెజ్ ఆర్ట‌ర్ చేసి తెప్పిస్తానంటాడు. ఆ త‌రువాత అంతా భోజ‌నానికి కూర్చుంటారు. ఇదే టైమ్ లో భోజ‌నం త‌రువాత అంత్య‌క్ష‌రి ఆడ‌దాం అంటుంది నిధి. ఈ క్ర‌మంలో ఏం జ‌రిగింది? .. వేద - య‌ష్ లు ఏం చేశార‌న్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...