English | Telugu

'ఐ హేట్ యూ కృష్ణ' అని చెప్పిన నందు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -228 లో.. కృష్ణ దగ్గరికి రేవతి వచ్చి బాధపడుతుంది. నిన్ను ఇన్నిరోజులు ఒక అమ్మలాగా చూసుకున్నా.. నాక్కూడా మీది అగ్రిమెంట్ మ్యారేజ్ అని చెప్పాలని అనిపించలేదా అని కృష్ణని అడుగుతుంది. ఇన్ని రోజులు మాతో కలిసి మెలిసి ఉండి.. నువ్వు ఇలా సడన్ గా వెళ్ళిపోతే, మేం ఎలా ఉంటామని రేవతి ఎమోషనల్ అవుతుంది. ఇంకా ఇక్కడే ఉంటే ఏసీపీ సర్ అంటే ఇష్టమని చెప్పేలా ఉన్నాను. ఇక్కడ నుండి వెళ్ళాలని కృష్ణ అనుకొని వెళ్ళిపోతుంది.

మరొకవైపు కృష్ణ, మురారి, ముకుంద, రేవతి.. ఇలా ఎవరికి వారే ఆలోచిస్తూ బాధపడతారు. ఆ తర్వాత మురారి వైపు కృష్ణ కోపంగా చూస్తుంది‌. ఏమైంది కృష్ణకి.. నా వైపు కోపంగా చూస్తుందని మురారి అనుకుంటాడు. ఏమైంది కృష్ణ అంత కోపంగా ఉన్నావని అడుగుతాడు. అత్తయ్యతో ఏం మాట్లాడారు.. మన అగ్రిమెంట్ గురించి ఎందుకు చెప్పారని కృష్ణ అడుగుతుంది. లేదు కృష్ణ నేను చెప్పలేదు.. అమ్మకి ఎలా తెలుసో నాకు తెలియదని మురారి అంటాడు. ముకుందకి మురారి అగ్రిమెంట్ గురించి చెప్పిన విషయం గుర్తు చేసుకుంటాడు. మరి మన మధ్య ఉన్న అగ్రిమెంట్ మ్యాటర్ అత్తయ్యకి ఎలా తెలుస్తుందని కృష్ణ అడుగుతుంది. నేనయితే అమ్మకి చెప్పలేదని మురారి అంటాడు. అయితే పెద్ద అత్తయ్యకి ఎప్పుడు చెప్తారని కృష్ణ అడుగుతుంది. టైమ్ చూసుకొని చెప్తానని మురారి చెప్పేసి వెళ్ళిపోతాడు. అసలు అత్తయ్యకి అగ్రిమెంట్ గురించి ఎలా తెలుసని కృష్ణ ఆలోచిస్తుంది. మరొక వైపు ముకుంద దగ్గరికి అలేఖ్య వెళ్లి.. కొన్ని రోజుల్లో కృష్ణ ఇంటి నుండి వెళ్ళిపోతుందట అని ముకుందకి చెప్తుంది. తనకి వెళ్ళాలని ఉన్నా, ఇంట్లో వాళ్ళు వెళ్ళనివ్వరు.. పైగా రేవతి అత్తయ్య, నందు తనకి సపోర్ట్ గా ఉన్నారు. ఇప్పుడు మనం మంచి నిర్ణయం తీసుకోవాలి. దానికి నీ సపోర్ట్ కావాలని అలేఖ్యతో ముకుంద అనగానే సరేనని అలేఖ్య అంటుంది.

మరొక వైపు కృష్ణకి వాళ్ళ హాస్పిటల్ హెడ్ ఫోన్ చేసి.. ఒక విలేజ్ లో హెల్త్ క్యాంప్ ఉంది. అది మనకి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా వెళ్ళమని చెప్పొచ్చు, రెడీగా ఉండమని చెప్పగానే కృష్ణ సరేనంటుంది. ఈ విషయం పెద్దత్తయ్య, ఏసీపీ సర్ కి చెప్పాలని అనుకుంటుంది. అప్పుడే కృష్ణ దగ్గరికి నందు వచ్చి.. మురారిపై నీ అభిప్రాయం ఏంటని నందు అడుగుతుంది. గౌరవమని చెప్తుంది. అప్పుడే మురారి అన్న మాటలు గుర్తుచేసుకొన్న నందు.. ఐ హేట్ యూ కృష్ణ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఏంటి నందు అలా అందని కృష్ణ ఆలోచిస్తుంది. మరొకవైపు కృష్ణ తనను వదిలి వెళ్ళిపోతుందనే విషయం గుర్తుచేసుకుంటూ బాధపడతాడు మురారి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.