English | Telugu

Nainisha Rai : బ్రహ్మముడి అప్పుకి కమిట్ మెంట్ ఇవ్వలేదని వేధింపులు!

నైనిషా రాయ్.. ఈ పేరు ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'బ్రహ్మముడి' సీరియల్ ప్రేక్షకులకు 'అప్పు' అంటే సుపరిచితమే. అప్పు పాత్రలో నైనిషా రాయ్ నటిస్తూ అందరికి ఆకట్టుకుంటుంది. రాజ్ తమ్ముడు కళ్యాణ్ కి మంచి ఫ్రెండ్ లా నటిస్తుంది. 'బ్రహ్మముడి' సీరియల్ లో అప్పుగా కనకం-కృష్ణమూర్తిలకి కూతురిగా నటిస్తుంది. వాళ్ళ ఫ్యామిలీకి భారం కాకూడదని అప్పు.. తను సొంతంగా డబ్బులు సంపాదించుకుంటూ చదువుకుంటుంది. ఈ సీరియల్ లో అప్పు.. లేడీ రౌడీలా అదరగొడుతుంది.

నైనిషా రాయ్.. తెలుగు సీరియల్ నటి. 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' సీరియల్ తో ఫేమ్ లోకి వచ్చిన నైనిషా అనేక సీరియల్స్ లో చేసింది. సీరియల్స్ తో పాటు పలు సినిమాలలో కూడా నైనిషా రాయ్ నటించింది. 'కథానిక', 'సూర్య' వంటి సినిమాలలో నటించింది నైనిషా. పశ్చిమ బెంగాల్ లో‌ పుట్టిన నైనిషా.. అక్కడ కొన్ని సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. ఆ తర్వాత తను లా కోర్స్ చదివింది. అయితే తనకి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తో తెలుగులో పలు సీరియల్స్ లో నటించింది. జెమినిలో ప్రసారమైన 'భాగ్యరేఖ' సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది నైనిష. ఆ తర్వాత ఈటీవీలో ప్రసారమైన 'శ్రీమంతుడు' సీరియల్ లో కార్తీక పాత్రలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బంధం సీరియల్ లో నటించింది నైనిషా రాయ్. అయితే ఇండస్ట్రీలో తనకు ఎదురైన అనుభవాలను చెప్పుకుంది. ఇండస్ట్రీ వైపు వచ్చిన తరువాత కనీసం తినడానికి తిండి లేకుండా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. ఆకలి తీర్చుకోవడానికి నా రక్తం నేనే డొనేట్ చేసి కడుపునింపుకున్నాను.అన్ని కష్టాలను ఎదుర్కొని నటిగా ప్రయత్నిస్తే.. మరి నాకేంటి? అని ఎదురైన పరిస్థితులు నా లైఫ్‌లో చాలానే ఉన్నాయి. నేనూ క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాను. కమిట్ మెంట్ ఇస్తేనే ఆఫర్లు ఇస్తామని అనేవారు. నేను కమిట్ మెంట్ ఇస్తాననే ఉద్దేశంలోనే నాకు ఓ ఆఫర్ ఇచ్చారు.

షూటింగ్ స్టార్ట్ కాబోతుందనగా.. వాళ్లు నన్ను రమ్మని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. నాకు ఇష్టం లేని పని చేయనని వాళ్లని కొట్టి మరీ వచ్చేశాను. ఆ తరువాత నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. ఈ కష్టాలను అనుభవించలేక చనిపోవాలని అనుకున్నాను. కష్టం వచ్చిందని చెప్పుకోవడానికి ఎవరు లేరు. అలాగని తిరిగి ఇంటికి వెళ్లలేను. నాకూ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా.. దాన్ని చంపుకోలేను. కష్టాలను భరించలేక చనిపోవాలని అనుకున్నాను.. చాలాసార్లు ఆత్మహత్యాయత్నం చేశానంటూ తన కష్టాలని చెప్పుకుంది నైనిషా.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.