English | Telugu

ఆర్పీ గుండె మీద 'నాగబాబు'!

బుల్లితెర విషయాలు మాట్లాడుకోవాలంటే 'జబర్దస్త్' షోతోనే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది బుల్లితెర చరిత్రలో ఒక ట్రెండ్ సెట్టర్ షో. ఇక ఈ షోలో ఎవరికి వారే డిఫరెంట్, సంథింగ్ స్పెషల్ పర్సన్స్. అందులోనూ నాగబాబు ఇంకొంచెం స్పెషల్. ఆయనకు తెలియకుండా షోలో ఏదీ జరిగేది కాదు. నాగబాబు ఈ షోకి కానీ, కమెడియన్స్ కి కానీ ఒక పెద్ద దిక్కుగా వ్యవహరించేవారు. రోజా కూడా నాగబాబు వల్లనే ఫేమస్ అయ్యింది.

ఒకవిధంగా చెప్పాలంటే నాగబాబు ఈ షోలో వాళ్లందరికి ఒక ఆరాధ్య దైవం అన్ని చెప్పొచ్చు. ఆయన కోసం నిప్పుల్లో దూకమన్నా దూకుతారు, పచ్చబొట్లు కూడా పొడిపించుకుంటారు. చివరికి నాగబాబు 'జబర్దస్త్'కి బై బై చెప్పి 'అదిరింది' షోకి వెళ్లిపోయారు. ఇక ఆయన్ని నిత్యం ఆరాధించే చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ వంటి వాళ్ళు కూడా ఆ షో నుంచి వచ్చేసారు.

ఒక్క మాట‌లో చెప్పాలంటే కిర్రాక్ ఆర్పీకి నాగబాబు అంటే పిచ్చి. ఆయనకు చెప్పకుండా ఒక్క పని చేయడు. చివరిగా ఆర్పీకి ఆయన మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు బయటపడింది. సుధీర్ ఆయన ప్రేమను ప్రపంచానికి చూపించాడు. ఇక ఈ విషయం నాగబాబుకు చెప్పకుండా చేసాడు. నాగబాబు అంటే పచ్చబొట్టు పొడిపించుకునేంత ప్రేమ అని ఆయన గుండెల మీద ఉన్న పచ్చబొట్టుని నాగబాబుకి చూపించాడు సుధీర్.

"అదేంట్రా ఎప్పుడూ చెప్పలేదు?" అంటూ నాగబాబు షాక్ అయ్యాడు. ఒక్క నిమిషం ఆర్పీ చేసిన పనికి ఎమోషన్ అయ్యాడు. "వీడి పిచ్చి ఏంటో వీడికే తెలీదు. అందుకే కిర్రాక్ ఆర్పీ అని పేరు పెట్టుకున్నాడు" అని సుధీర్ అన్నాడు. 'పార్టీ చేద్దాం పుష్ప' అనే షోలో ఇది చూడొచ్చు. ఇప్పుడు ఈ షోకి సంబంధించి ప్రోమో విడుదల అయ్యింది.

Karthika Deepam2: వైరాతో జ్యోత్స్న డీలింగ్.. కార్తీక్ కి డౌట్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -544 లో.....శౌర్యకి దీప భోజనం తినిపిస్తుంది. అది చూసి కొడుకు కోడలితో చెల్లి మాట్లాడుతలేనట్లు ఉందని అనసూయ అంటుంది. వాళ్లే దాక్కొని తిరుగుతున్నారని కాంచన అంటుంది. శౌర్య వెంట భోజనం తినమని దీప పరుగెడుతుంది. శౌర్య అలా అమ్మని పరిగెత్తించవచ్చా.. ఇప్పుడు అమ్మ కడుపులో బేబీ ఉంది కదా తనకి ఆయాసం వస్తుంది ఇకనుండి నువ్వే భోజనం చెయ్యాలని కాంచన అనగానే.. నువ్వు మంచి నానమ్మవి కాదు నిన్ను తాతయ్య దగ్గరికి పంపించాలి.. మా అమ్మ నాకు తినిపించకుండా చేస్తున్నావని శౌర్య అంటుంది.

Illu illalu pillalu: ఇంగ్లీష్ టీచర్ గా శ్రీవల్లి.. ప్రేమ, నర్మద ప్లాన్ సూపర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో... భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు ఇంటికి శ్రీవల్లి డూప్లికేట్ సర్టిఫికేట్లు తీసుకొని వస్తారు. అవి ప్రేమ చూసి డూప్లికేట్ సర్టిఫికేట్లు అని చెప్పదు. ఇంకేంటి మావయ్య మీరు మీకు తెలిసిన కాలేజీ ప్రిన్సిపల్ కి ఫోన్ చెయ్యండి.. అక్క  ఇంగ్లీష్ టీచర్ గా జాయిన్ చెయ్యండి అని ప్రేమ అంటుంది. రామరాజు ఫోన్ చేస్తుంటే కావాలనే శ్రీవల్లి తుమ్ముతుంది. ఇప్పుడే వద్దు మావయ్య అంటుంది. అయినా రామరాజు వినకుండా ఫోన్ చేసి ప్రిన్సిపల్ తో మాట్లాడతాడు.