English | Telugu

పైనాపిల్ హల్వా తిన్నారా ఎప్పుడైనా ?

కరాటే కళ్యాణి చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. ఒకరకమైన హస్కి వాయిస్ తో మత్తుగా మాట్లాడ్డం ఆమెకే సొంతం. కళ్యాణి అనే అబ్బా ..బాబీ.. అనే డైలాగ్ మస్త్ ఫేమస్..ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 4 లో కాంటెస్ట్ చేసింది. ఈమె ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూలో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. యాక్టర్ కాకముందు కల్యాణి ..హరికథా కళాకారిణిగా ఎన్నో స్టేజి షోస్ చేసింది. అలాంటి టైములో వినాయక్ కంటబడిన కళ్యాణి ఆ తర్వాత ఆయన డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఆది మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టారు.

ఆ తర్వాత "కృష్ణ, మిరపకాయ్, లక్ష్మి నరసింహ, శంకర్ దాదా ఎంబిబిస్" లో నటించారు. అలాగే కొన్ని సీరియల్స్ కూడా యాక్ట్ చేసారు కళ్యాణి. గోరంత దీపం, ముత్యాల ముగ్గు, మధుమాసం సీరియల్స్ మంచి గుర్తింపు తెచ్చాయి. కృష్ణ మూవీ కళ్యాణికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు కళ్యాణి సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవల గోవా వెళ్లిన కల్యాణి అక్కడ పైనాపిల్ హల్వా తిన్నదట. దాని మీద ఒక వీడియో చేసి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. గోవా వస్తే మాత్రం ఈ పైనాపిల్ హల్వా తినడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, మిస్సవ్వొద్దు . ఇట్స్ సో యమ్మీ అంది కల్యాణి. గోవాలో స్ట్రీట్ ఫుడ్ చాలా బాగుంటుంది అని చెప్పింది.

రవితేజ హీరోగా నటించిన కృష్ణ మూవీలో బ్రహ్మానందాన్ని బాబీ అంటూ ఒక రకమైన పిలుపుతో పిలుస్తుంది .. ఆ డైలాగ్ ఆమె చెప్పే విధానంతో ఆమె మంచి పాపులర్ అయింది. ఈ డైలాగ్ ఈమెకు ఎన్నో అవకాశాలను తెచ్చిపెట్టింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.