English | Telugu

రాజ్ తో పెళ్ళి ఫిక్స్.. స్వప్న సీక్రెట్ లవ్ ఫట్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'బ్రహ్మముడి' సీరియల్ అత్యంత ప్రేక్షకాదరణ పొందుతూ ఎపిసోడ్-26 లోకి అడుగుపెట్టింది. కాగా బుధవారం నాటి ఎపిసోడ్ లో.. రాజ్, స్వప్నల పెళ్ళికి మూడు నెలల వరకు ముహూర్తాలు లేవని పంతులు గారు చెప్పడం తో, అన్ని రోజులు పెళ్ళికి టైం అంటే.. ఎక్కడ తన బాగోతం బయటపడుతుందోనని కనకం టెన్షన్ పడుతుంది. అన్ని రోజులు అంటే కుదరదు మా అక్క ఆస్ట్రేలియా వెళ్ళిపోతుంది. మా దైవం అక్క కాబట్టి తను వెళ్ళకముందే పెళ్ళి చెయ్యాలని అంటుంది. ఇక రాజ్ ఫ్యామిలీకి స్వప్న బాగా నచ్చడంతో దగ్గర్లో ముహూర్తం చూడమని పంతులుకి చెప్పగా.. అతను అంతా మళ్ళీ చూసి వారంలో ముహూర్తం ఉందని అనడంతో.. సరేనని రెండు కుటుంబాలు తాంబూలాలు మార్చుకుంటారు. రాజ్ తనకు నచ్చిన అమ్మాయిని పెళ్ళి చేసుకుంటున్నానని హ్యాపీగా ఫీల్ అవుతాడు.

ఇక రాజ్ ఫ్యామిలీ వెళ్ళిపోయాక.. స్వప్న గదిలోకి వెళ్ళి చిరాకుగా రాహుల్ కి ఫోన్ చేస్తుంది. "మీరు సూటిగా ఏది చెప్పరా? నాకు ఎంగేజ్మెంట్ అయితే నువ్వు హ్యాపీగా ఉన్నావా" అని అంటుంది స్వప్న. "రాజ్ అంటే ఇష్టం లేదనన్నావ్ మరి నీకెవరు ఇష్టమో చెప్పలేదు కదా" అని రాహుల్ అంటాడు. నేను మీతో మాట్లాడాలి అని స్వప్న అనగానే.. అయితే రాత్రి మీ ఇంటి ముందుకు వస్తానని రాహుల్ అంటాడు. మరోవైపు రాజ్ పెళ్ళి వారంలో ఎలా సాధ్యం అవుతుంది. దుగ్గిరాల ఫ్యామిలీ వారసుడు పెళ్ళి ఏర్పాట్లకు టైమ్ పడుతుంది కదా.. ఇలా ఎందుకు చేశారంటూ ఇంట్లో వాళ్ళపై కోప్పడతాడు రాజ్ తండ్రి.

ఇక స్వప్న పెళ్ళికి కనకం అప్పు చెయ్యాలనుకుంటుంది. అందుకు కృష్ణమూర్తి కనకం ని కోప్పడతాడు. మరోవైపు దగ్గరలో పెళ్ళి పెట్టుకొని స్వప్న ఒక్కసారి కూడా రాజ్ తో మాట్లాడలేదు. స్వప్నకి ఈ పెళ్ళి అంటే ఇష్టముందా లేదా అనే డౌట్ రాజ్ కి వస్తుంది. ఇక స్వప్నకి ఫోన్ చేసి అడుగుదామని ఫోన్ చేస్తాడు. అప్పుడే స్వప్న తన గదిలోకి వెళ్తుంది. ఫోన్ రింగ్ అవడం చూసి పక్కనే ఉన్న కావ్య.. "అక్కా.. లే ఫోన్ వస్తుంది" అని లేపుతుంది. దుప్పటి తీసేసరికి స్వప్న లేకపోవడంతో ఈ టైంలో లో ఎక్కడికి వెళ్ళిందని కావ్యకి డౌట్ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.