English | Telugu

మురారి ఈ తింగరిపిల్లతో ఎలా వేగుతున్నావ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎపిసోడ్-87 లోకి అడుగుపెట్టింది. కాగా బుధవారం నాటి ఎపిసోడ్ లో.. కృష్ణని తీసుకొని మురారి కాలేజీకి వెళ్తాడు. అక్కడ ఒక మేడం దగ్గరికి వెళ్తారు. కృష్ణని మేడం సర్టిఫికెట్స్ ఇవ్వమనగా కృష్ణ కంగారుగా అన్ని సర్టిఫికెట్స్ కింద పడేస్తుంది. అప్పుడు అది చూసిన మేడం.. "ఈ తింగరి పిల్లను ఎలా పెళ్ళి చేసుకున్నావ్" అని మురారితో అంటుంది. అప్పుడు కృష్ణ మురారి ఒకరి మొహం ఒకరు చూసుకొని అక్కడ పెద్ద అత్తయ్య కూడా అలానే అంటుందని కృష్ణ అంటుంది. తర్వాత ఫీజు కట్టడానికి కృష్ణ వెళ్తుంటే తనని ఆపి మురారి పే చేస్తా అని అంటాడు. లేదు నేను చేస్తానని కృష్ణ అంటుంది. "నన్ను పరాయివాడిలా చూస్తున్నావ్.. ఈ విషయం అమ్మకి చెప్తే గరిటె అందుకొని నన్ను వాయిస్తుంది" అని మురారి అంటాడు. అలా అనడంతో కృష్ణ సరేనని ఒప్పుకుంటుంది.

తర్వాత మురారి, కృష్ణ లు ఇంట్లోకి వెళ్లి కాలేజీలో మేడం అన్న మాటలను గుర్తు చేసుకుంటారు. ఎదురుగా ఉన్న భవాని వాళ్ళని చూసి.. కాలేజీ కి వెళ్ళిన పని అయిందా అని అడుగుతుంది. హా అయిపోయింది పెద్దమ్మ అని మురారి చెప్తాడు.. " ఏసీపి సర్ ఎంత మంచివాడో పెద్ద అత్తయ్య.. నాకోసం రెండు సార్లు.. మూడు ఫ్లోర్ లు ఎక్కి దిగి ఫీజు కట్టి వచ్చాడు" అని కృష్ణ సరదాగా అంటుంది. ఏంట్రా మురారి ఈ తింగరి పిల్లతో ఎలా వేగుతున్నావ్ అని భవాని అంటుంది. దానికి మురారి.. "తప్పదు కదా పెద్దమ్మా" అని సరదాగా అంటాడు. దాంతో కృష్ణ అలిగి కోపంగా తన గదిలోకి వెళ్తుంది. నీ భార్య అలిగినట్లు ఉంది వెళ్ళి ఓదార్చు అని మురారిని పంపిస్తుంది భవాని.

గదిలోకి వెళ్ళిన కృష్ణని చూసి మురారి తన సరదా మాటలతో నవ్వించడానికి ప్రయతిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.