English | Telugu

ముకుంద ఎవరిని ప్రేమించిందో కృష్ణ తెలుసుకుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ ఎపిసోడ్ - 79 లోకి అడుగుపెట్టింది. కాగా సోమవారం రోజు నాటి ఎపిసోడ్ లో.. కృష్ణ, మురారి లు సరదాగా రెస్టారెంట్ కి వెళ్ళగా.. ముకుంద వాళ్ళని హ్యాపీగా ఉండనివ్వకుండా, డిస్టబ్ చేయాలని మురారికి మెసేజ్ చేస్తూనే ఉంటుంది. మురారికి వచ్చే మెసెజ్ లు చూసిన కృష్ణ.. "ఏంటి సర్ అన్ని మెసేజ్ లు వస్తున్నాయ్? ఏంటి" అని అడుగుతుంది. అవన్నీ అనవసరమైన మెసేజ్ లు అని మురారి అంటాడు. ఇక ముకుంద ఇంటికి కార్ లో వస్తున్నప్పుడు.. "వాళ్లిద్దరు ప్రశాంతంగా మాట్లాడుకోకుండా మెసేజ్ చేశాను" అని అనుకుంటుంది. ఇక కృష్ణ, మురారికి గిఫ్ట్ ఇచ్చి ఇది ఇప్పుడు ఓపెన్ చెయ్యకండి. దీనిని చూసినప్పుడల్లా నేను గుర్తు రావాలని అంటుంది.

మరోవైపు రేవతి ఇల్లంతా ముకుంద కోస‌ం వెతుకుతుంటుంది. ముకుంద ఇంట్లో ఎక్కడా కన్పించకపోవడంతో.. సుమలత, అలేఖ్యలను పిలిచి ముకుంద ఎక్కడని అడుగుతుంది. మురారి, కృష్ణ లు వెళ్ళగానే వాళ్ళ వెనకే వెళ్ళిందని అలేఖ్య చెప్పడంతో.. వాళ్ళని ఫాలో చేస్తూ వెళ్లిందా అని రేవతి అనుకుంటుండగా.. ముకుంద వస్తుంది. "భోజనం చేద్దువురా ముకుంద" అని రేవతి అడుగుతుంది. నాకు ఇప్పుడే వద్దని ముకుంద వెళ్ళిపోతుంది. ఇంతలోనే కృష్ణ, మురారిలు కూడా ఇంటికి వస్తారు. ఆ తర్వాత రేవతి, భవాని దగ్గరికి వెళ్ళి ఒక విషయం చెప్పాలని అంటుంది. "ఏంటీ రేవతి.. కృష్ణ చదువుకోవడానికి ఒప్పుకున్నావ్ కదా ఇంకేంటి" అని భవాని అంటుంది. ఇప్పుడు కృష్ణ చదువుకోవడానికి దూరంగా వెళ్తే ఇప్పట్లో రాదు కదా అందుకని వాళ్ళని హనీమూన్ కి పంపించాలని రేవతి అంటుంది. దానికి భవాని కూడా ఒప్పుకుంటుంది.

అందరూ భోజనం చేస్తుండగా.. మీరు హనీమూన్ కి వెళ్ళండని భవాని అనగానే కృష్ణ, మురారి ఇద్దరు షాక్ అవుతారు. కాసేపటికి ఏం చెప్పాలో తెలియక భవాని చెప్పిందని ఆలోచించి ఇద్దరూ సరేనంటారు. అది ముకుంద విని..వాళ్ళకి హనీమూన్ ఏంటీ అని అనుకుంటుంది. కాసేపటికి కృష్ణ వచ్చి.. "నేను హనీమూన్ కి రాను.. మీరు ఎలాగైనా హనీమూన్ ని కాన్సిల్ చెయ్యండి" అని కృష్ణ అంటుంది. ఇంతలో మురారి ఫోన్ కి ముకుంద కాల్ చేస్తుంది. ఆ ఫోన్ కృష్ణ లిఫ్ట్ చేసి.. ముకుంద పేరు రావడం తో.. "ఆ ముకుంద ఏంటి చెప్పు" అని అనగానే.. తను మురారిని ప్రేమించిన విషయం కృష్ణకి చెప్తుంది. ఏమైంది అని మురారి కృష్ణ ని అడుగగా.. "మన ముకుంద ఎవరినో ప్రేమించిందనుకున్నాం కదా.. ఆ ప్రేమించింది ఎవరినో చెప్పింది" అని అనగానే మురారి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ముకుంద నిజంగానే వాళ్ళిద్దరు ప్రేమించుకున్న విషయాన్ని కృష్ణకి చెప్పిందా తెలియాలంటే ఆ తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.