English | Telugu
వసుధార తలనొప్పి డ్రామాతో రిషి ఫైర్!
Updated : Feb 13, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ ఎపిసోడ్ -685 లోకి అడుగుపెట్టింది. కాగా సోమవారం నాటి ఎపిసోడ్ లో.. రిషి సర్ ని ఇక బాధ పెట్టలేను నాన్న.. సర్ కి నిజం చెప్పేస్తానని చక్రపాణితో అంటుంది వసుధార. ఇక మరో వైపు జగతి, మహేంద్రలు ఎదురు తిరగడంతో దేవయాని కోపంతో రగిలిపోతుంది.. వెంటనే రిషి దగ్గరికి వెళ్ళి.. "నాన్న రిషి.. నిన్న ఎక్కడికో బయటికి వెళ్ళావంట కదా" అని అనగానే.. "అవును పెద్దమ్మ.. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ పని మీద నేను వసుధార కలిసి వెళ్ళాం" అని రిషి సమాధానమిస్తాడు. ఎందుకు నాన్న ఆ వసుధారతో వెళ్లడం.. ఎవరినో పెళ్లి చేసుకొని వచ్చి నీ ముందే ఉంటూ.. నిన్ను బాధ పెడుతుందని దేవాయని చెప్పగా.. పెద్దమ్మ కాలేజీ వర్క్ కి, నా పర్సనల్ దానికి ముడి పెట్టకూడదు. అయినా నువ్వు ఇవన్నీ అలోచించి.. నీ మనసు పాడు చేసుకోకని రిషి అంటాడు. ఆ తర్వాత అక్కడ నుండి దేవాయని కోపంతో వెళ్ళిపోతుంది.
రిషి, వసుధారల గురించి జగతి, మహేంద్రలు ఆలోచిస్తుండగా.. రిషి వచ్చి మేడం నా దగ్గర ఏమైనా దాస్తున్నారా? అని అడుగుతాడు. లేదు రిషి ఎందుకలా అడుగుతున్నావని జగతి అంటుంది. మీరు వసుధార విషయంలో చేంజ్ అయ్యారు. కోపంగా ఉండే మీరు.. ఇప్పుడు బానే మాట్లాడుకుంటున్నారు. ఏమైనా నిజం తెలిసిందా అని రిషి అడుగుతాడు. "నాకు నిజం తెలిసి కూడా చెప్పట్లేదు.. నిజం తెలిసిన రోజు, నేను చెప్పలేదని రిషి ఎంత గొడవ చేస్తాడో" అని జగతి మనసులో అనుకుంటుంది. ఏదైనా వసుధార విషయం ఏమైనా తెలిస్తే ప్లీజ్ చెప్పండి అని రిషి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రెండు రోజుల్లో రిషి నిజం తెలుసుకోకపోతే నేనే చెప్తానని జగతితో అంటాడు మహేంద్ర.
ఆ తర్వాత వసుధార ఇంటికి రిషి కార్ లో వచ్చి హారన్ కొడుతుంటాడు. అయ్యినా వసుధార పట్టించుకోనట్లు ఉంటుంది. ఎంత హారన్ కొట్టినా రాకపోయేసరికి రిషి లోపలికి వెళ్తాడు. రిషిని చూడనట్లుగా యాక్ట్ చేస్తుంటుంది వసుధార. "నాన్న నాకు తలనొప్పిగా ఉంది. ఎవరు వచ్చినా నేను లేనని చెప్పండి.. ఫోన్ చేసినా తలనొప్పిగా ఉందని చెప్పండి" అని వసుధార వాళ్ళ నాన్న చక్రపాణితో చెప్తుంది. వసుధార చెప్పిన మాటలు విన్న రిషి.. ఏంటి నన్ను చూసే అంటుందా అని అనుకుంటాడు. అయినా పట్టించుకోకుండా రిషి లోపలికి వస్తాడు. చక్రపాణి చూసి కాఫీ తీసుకొస్తానని అనగా.. వద్ధని అంటాడు రిషి. "నాన్న ఈ రోజు కాలేజీకి వెళ్ళట్లేదు" అని రిషికి తెలియాలని వసుధార అంటుంది. దానికి రిషి.. "ఇలా చెప్పకుండా రాకపోవడం కరెక్ట్ కాదు చక్రపాణి గారు" అని అంటాడు. అయితే ఇప్పుడే మా MD గారికి లీవ్ లెటర్ పంపిస్తున్నానంటూ వసుధార లీవ్ లెటర్ టైప్ చేసి పంపిస్తుంది. కాఫీ తాగి వెళ్ళండని చక్రపాణి అనగానే.. "లేదు నాకు తలనొప్పిగా ఉన్నప్పుడు తప్పకుండా మీ ఇంటికే వచ్చి కాఫీ తాగుతాను" అని రిషి చెప్తూ అక్కడనుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.