English | Telugu

కృష్ణ కారణంగా సస్పెండ్ అయిన మురారి!

'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ రోజు రోజుకి ఆసక్తిని కలిగిస్తోంది. అయితే శుక్రవారం జరిగిన ఎపిసోడ్-47 లో‌ అలసిపోయి పడుకున్న కృష్ణని ఓదార్చడానికి మురారి వాళ్ళ అమ్మ జ్యూస్ తీసుకొని వస్తుంది. ఆమె మాట్లాడుతూ "కృష్ణ.. ఈ పనులన్నీ నీకు కొత్త కదా.. ఈ ఇల్లు జైలు కాదు. కానీ కొన్ని నియమాలు ఉన్నాయి. ఇది రిటైర్డ్ ఆర్మీ మేజర్ ఇల్లు. అందుకే ఇన్ని నియమాలు. అందరూ వీటిని పాటిస్తారు కాబట్టి ఎవరికీ ఏం ఇబ్బంది ఉండదు. నీకు ఏమైనా అవసరం ఉంటే చెప్పమ్మ.. మొహమాటపడకు" అని చెప్పేసి వెళ్తుంది.

ఆ తర్వాత మురారి వాళ్ళ ఇంటికి ఒక కానిస్టేబుల్ వస్తాడు. "కమీషనర్ ఈ లెటర్ మురారి సర్ కి ఇవ్వమన్నారు" అని వాళ్ళ అమ్మకి తీసుకొచ్చి ఇస్తాడు. ఆ తర్వాత అది తీసుకెళ్ళి మురారికి ఇస్తుంది. ఆ లెటర్ లో శివన్న అనే వ్యక్తి.. ఇంక ఆ ఊరి పెద్దలు కొందరు కలిసి కంప్లేంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఊరి అమ్మాయిని బలవంతంగా పెళ్ళి చేసుకున్నాడు. అది తప్పు అని నిరూపించుకున్న తర్వాతనే మళ్ళీ విధుల్లోకి రావాలని అందులో ఉంటుంది.వెంటనే మురారి కమీషనర్ దగ్గరికి వెళ్తాడు.

మురారి హడావిడిగా వెళ్లడం చూసిన ముకుంద.. ఏమై ఉంటుందా అని ఆ లెటర్ చదువుతుంది. అది చదివాక మురారి సస్పెండ్ అయిన విషయం తెలుస్తుంది. వెంటనే ఇంట్లో వాళ్లకి ఆ విషయం చెప్తుంది. అందరికి కృష్ణ వల్లనే సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. ఆ తర్వాత కృష్ణని పిలిచి భవాని అడుగుతుంది. "శివన్న ఎవరు? నీ వల్ల నా కొడుకు సస్పెండ్ అయ్యాడు. కొత్త కోడలు అత్తగారింటికి వచ్చినప్పుడు ‌చీరా.. సారె తీసుకొస్తారు. ఈ మహాతల్లేమో అరిష్టాలని, అప్రతిష్టలని తీసుకొచ్చింది" అని కోప్పడుతుంది భవాని. ఎన్ని మాటలు అన్నా కూడా కృష్ట మౌనంగా ఉండిపోతుంది. ఆ తర్వాత ‌తన గదిలోకెళ్ళి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకుంటూ బాధపడుతుంది.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.