English | Telugu

నేను మీతో కలిసి ఉంటాను.. దీపకు మోనిత ప్రపోజల్.!

'కార్తీకదీపం' సీరియల్ ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది.అయితే శుక్రవారం జరిగిన ఎపిసోడ్-1555 లో మోనిత గురించి ఆలోచిస్తూ.. దీప పరధ్యానంతో వంట చేస్తూ ఉంటుంది. కార్తీక్ వస్తాడు. దీప పరధ్యానం చూసి అడుగుతుంటాడు. కార్తీక్ మాట్లాడుతూ "ఏంటీ దీప.. మోనిత గురించి ఆలోచిస్తున్నావా? దాని గురించి ఎందుకు పట్టించుకుంటావ్. దాని సంగతి నేను చూసుకుంటా.. నువ్వేం ఆలోచించకు" అని చెప్తాడు. కార్తిక్ ఎంత చెప్పినా దీప మౌనంగా ఉండిపోతుంది. "అసలా మోనిత మన దగ్గరికి రాలేదనుకో, మోనిత మన దగ్గరికి రాకుండా ఏం చెయ్యాలో నాకు తెలుసు" అని చెప్పి వెళ్ళిపోతాడు కార్తిక్.

మోనిత ని కలవడానికి కార్తీక్ వస్తాడు. "మోనిత.. నీతో మాట్లాడాలి" అని కార్తిక్ అంటాడు. "మాట్లాడు కార్తీక్..ఒక్కసారి నా చెయ్యి పట్టుకో, అంతులేని సంతోషాన్ని అందిస్తాను" అని మోనిత అంటుంది. "మా జోలికి రావొద్దు" అని కోపంగా చెప్తాడు కార్తిక్. "ఇకనుండి మా దగ్గరికి రావొద్దు.. మమ్మల్ని వదిలెయ్" అని కార్తిక్ ఎంత చెప్పినా వినకుండా అలాగే ప్రవర్తిస్తుంది మోనిత.

ఆ తర్వాత దీప దగ్గరికి మోనిత వస్తుంది. "డాక్టర్ బాబు గురించి ఎదురుచూస్తున్నావా"
అని అడుగుతుంది. "నీకు ఎందుకే" అని దీప కోప్పడుతుంది. "నీ గురించి మాట్లాడటానికే, కార్తీక్ ఇప్పుడు నా దగ్గరికి వచ్చాడు. నిన్ను ప్రశాంతంగా ఉంచాలని అడిగాడు. నేను ఒప్పుకోకపోయేసరికి, కోపంగా అక్కడి నుండి వచ్చాడు. నా కోరికకు నువ్వు అయినా ఓకే చెప్తావా? నా కోరిక సింపుల్. నేను మీతో కలిసి ఉంటాను. మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చెయ్యను" అని మోనిత అడుగుతుంది. అలా అనగానే "చెప్పు తెగుద్ది" అని దీప అంటుంది. మోనిత మాట్లాడుతూ "మీ పెళ్లి అయినప్పటి నుండి మీరు సంతోషంగా ఉన్నారు. ఇక కార్తీక్ ని నాకు అప్పగించు. పోయేలోపు ఈ ప్రపోజల్ తో నువ్వే నా దగ్గరికి వస్తావ్ చూడు" అని మోనిత అంటుంది. ఆ తర్వాత "మళ్ళీ కలుద్దాం" అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మోనిత.

ఒకవైపు హిమ, శౌర్యలు వాళ్ళ అమ్మ నాన్నలను వెతుకుతుంటారు. అలా వెతుకుతున్నప్పుడు హేమచంద్ర ఎదురుపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే మరో ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.