English | Telugu

ఆయనతో వెళ్లడం అంటే సన్నీలియోన్ ని సంకనేసుకెళ్ళినట్టే!

సుడిగాలి సుధీర్ ని సన్నీ లియోన్ తో పోల్చాడు జబర్దస్త్ కమెడియన్ అవినాష్. ఈ మధ్య కాలంలో ఆహాలో "కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్" పేరుతో ఒక కామెడీ షో వస్తోంది. ఈ షోకి హోస్ట్ గా చేస్తున్నాడు సుడిగాలి సుధీర్. ఇదే షోలో వేణు, అవినాష్‌, సద్దామ్‌, జ్ఞానేశ్వర్, భాస్కర్ యాదమ్మ రాజు కామెడీ స్కిట్స్ చేస్తూ నవ్విస్తూ ఉంటారు.

ఇక రీసెంట్ గా స్ట్రీమ్ అవుతున్న ఎపిసోడ్ చూస్తే కడుపుబ్బా నవ్వాల్సిందే. ఇందులో అవినాష్ తన కామెడీ స్కిట్‌ లో భాగంగా 2017 లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పుకొచ్చాడు. సుధీర్‌, వేణు, రాంప్రసాద్‌, ధన్‌రాజ్‌ ఇలా అందరు కలిసి ఈవెంట్స్ కోసం అమెరికా వెళ్లారట. వేణు అన్నని తీసుకెళ్తే ప్రిన్సిపల్‌ని సంకన పెట్టుకుని తీసుకెళ్లినట్టే ఉంటుంది. అక్కడికి వెళ్లొద్దు, ఇక్కడికి వెళ్లొద్దు అని కండిషన్స్ పెడతాడని చెప్పాడు. తర్వాత సుడిగాలి సుధీర్‌ గురించి చెప్తూ సుధీర్ తో టూర్‌ వెళితే సన్నీలియోన్‌ని సంకన పెట్టుకుని వెళ్ళినట్టే అని అన్నాడు. కుదురుగా ఉండడని, అక్కడికి వెళదాం, ఇక్కడికి వెళదాం అంటూ ఉంటాడని చెప్పుకొచ్చాడు.

ఆ టైంలో తాము ఉన్న రూమ్ తనదంటూ ఒక రష్యాన్‌ అమ్మాయితో ఇష్యూ అయ్యిందని ఆ మేటర్ రాత్రి మొదలుకుని మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు సాగిందని చెప్పాడు. ఎవరి భాష ఎవరికీ అర్ధం కాకపోయేసరికి చివరికి సుధీర్ ఇంగ్లీష్ లో మాట్లాడి ఆ సమస్యను సాల్వ్ చేసాడని చెప్తూ ఎన్నో రకాల ఎమోషన్స్ ని స్టేజి మీద పండించాడు అవినాష్‌. దీంతో అవినాష్ స్కిట్‌ నవ్వులు పూయించింది. చైర్మన్ అనిల్‌ రావిపూడి స్పందిస్తూ, ఇది ఏ సర్టిఫికేట్‌ స్కిట్‌ అని, కానీ అవినాష్‌ యు సర్టిఫికేట్‌ కోటింగ్‌ వేసి చెప్పాడని, సేఫ్‌ గేమ్‌ ఆడాడని, తను సేఫ్‌ కానీ సుధీర్‌ని ఇరికించేసాడంటూ చెప్పాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.