English | Telugu

భవాని పంతంతో కృష్ణకి కష్టం.. ఫలించని ముకుంద ఆశ!

మంచి స్టోరీతో ప్రేక్షకులను ఆకర్షిస్తోన్న 'స్టార్ మా' టీవి సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. గురువారం జరిగిన ఎపిసోడ్- 46 లో కృష్ణ ఇంటిలోకి వస్తుంటే భవాని తనని ఆపి తిడుతుంది. "ఎక్కడికెళ్ళావ్ మమ్మల్ని అడిగి వెళ్లాలని తెలియదా?" అని భవాని కోప్పడుతుంది. దానికి బదులు చెప్తూ "నాకు బాధ ఉంది. కష్టం ఉంది" అని కృష్ణ చెప్తుంది. "నీకొచ్చిన బాధేంటి? కష్టమేంటి? " అని అడుగుతుంది భవాని. "నాకు నాన్న లేరు..అది కష్టం. నాన్న ఒంటరిగా పోయారు..అది బాధ. నాన్నకి పిండ ప్రధానం చేసి వచ్చాను" అని చెప్తుంది కృష్ణ. "ఏంటి పిండప్రధానం చేసి వచ్చావా? పెళ్ళి జరిగి నెల కూడా కాలేదు. అలా ఎలా చేస్తావ్" అని కోప్పడుతుంది భవాని. ఆ తర్వాత మురారి పంతులుని తీసుకొస్తాడు. అతను దోష పరిహారం చేస్తే సరిపోతుందని, ఇల్లు శుద్ది చేయాలని చెప్పి వెళ్ళిపోతాడు.

అయితే పంతులు చెప్పినట్టుగా అందరం చేద్దాం అని అనుకుంటారంతా.. కానీ కృష్ణ "నేను ఒక్కదాన్నే చేస్తాను" అని చెప్తుంది. దానికి భవాని " సరే నువ్వు ఒక్కదానివే చెయ్. ఎందుకంటే నీవల్లే కదా.. ఈ అరిష్టం" అని అంటుంది. ఆ తర్వాత కృష్ణ ఒక్కతే ఇల్లు శుభ్రపరచి, బోనం వండుతుంది. దేవుడి ప్రతిమలను శుభ్రపరిచి పూలతో అలంకరించి, నైవేద్యం పెడుతుంది. అలా మొత్తం పని కృష్ణ ఒక్కతే చెయ్యడం వల్ల అలసిపోతుంది. కళ్లు తిరిగి కింద పడిపోతుంది. దీంతో అందరూ అలానే చూస్తుండిపోతారు. మురారి వచ్చి కృష్ణని తన చేతులతో ఎత్తుకొని, తన రూంలోకి తీసుకెళ్తాడు.

అయితే మురారి, కృష్ణ మీద చూపిన ప్రేమను తన మీద చూపిస్తాడనే ఆశతో..తను కూడా కళ్ళు తిరిగినట్టు నటించి కిందపడిపోతుంది ముకుంద. అయితే మురారి తనని ముట్టుకోకుండా ఇంట్లో వాళ్ళందరిని పిలిచి ముకుందని తీసుకెళ్ళమంటాడు. అలా అందరూ కలిసి ముకుందని తన రూంలోకి తీసుకెళ్తారు.

ఆ తర్వాత ముకుంద దగ్గరికి వస్తాడు మురారి. "ఇప్పుడు ఎలా ఉంది. టేక్ కేర్" అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురుచూడాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.