English | Telugu

వైరల్ గా మారిన లడ్డు మేకింగ్ ఛాలెంజ్

వినాయక చవితి మొదలుకొని నిమజ్జనం వరకు ప్రతీరోజు భక్తులు ఒక్కో రకమైన స్వీట్ ఐటమ్స్ చేసి ప్రసాదంగా దేవుడికి సమర్పిస్తారు. అయితే కొందరు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మాత్రం వాటిని ఛాలెంజ్ గా తీసుకొని మరీ చేసేస్తున్నారు. ఆ ఛాలెంజ్ ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

బిగ్ బాస్ సీజన్-6 కంటెస్టెంట్స్ మెరీనా-రోహిత్ జంట 'లడ్డు మేకింగ్ ఛాలెంజ్' ని చేశారు. ఈ మేకింగ్ అంతా వ్లాగ్ చేసి తమ యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేశారు. అందులో వారిద్దరు కలిసి చేసిన ఫన్ కి ప్రేక్షకులు విశేషంగా స్పందిస్తున్నారు. ఇద్దరు కలిసి ఇంట్లోనే లడ్డులు పోటాపోటీగా చేశారు. ఇక లడ్డులు పూర్తయ్యాక వాటిని దేవుడికి సమర్పించి భక్తులకు పంచారు. ఇలా చేయడం వారికి తృప్తినిచ్చిందని, ఇంకా ఎక్కువ లడ్డులు చేస్తే బాగుండని మెరీనా-రోహిత్ అనుకున్నారు.‌

మెరీనా, రోహిత్ సాహ్ని.. బుల్లితెర సీరియల్స్ చూసే ప్రేక్షకులకు సుపరిచితమే. మెరీనా అబ్రహం గోవాలోని క్రిస్టియన్ ఫ్యామిలీలో‌ జన్మించగా.. రోహిత్ ని పెళ్ళి చేసుకొని హైదరాబాద్ లో ఉంటుంది. అప్పట్లో జీ తెలుగులో ప్రసారమయైన 'అమెరికా అమ్మాయి' సీరియల్ లో కళ్యాణిగా నటించి ప్రేక్షకులను మెప్పించింది. రోహిత్ కూడా సీరియల్స్ లో నటించాడు. నీలి కలువలు, అభిలాష సీరియల్స్ తో పాపులర్ అయ్యాడు. రోహిత్-మెరీనా ఇద్దరు కలిసి 'డ్యాన్స్ జోడి డ్యాన్స్' లో కూడా పాల్గొన్నారు.

అలా బుల్లితెరపై ఫేమస్ అయిన వీరిద్దరికి బిగ్ బాస్ లో 'రియల్ కపుల్' కోటాలో అవకాశం లభించింది. మెరీనా రోహిత్ బిగ్ బాస్ లో జంటగా అడుగుపెట్టి.. ఇద్దరు మంచి ప్రవర్తనతో ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గర అయ్యారు. అయితే రోహిత్ ని ఫ్యామిలీ మ్యాన్ అని అంటారు. రోహిత్ లోని డీసెంట్ నెస్, కూల్ అండ్ కామ్ ప్రవర్తన వల్ల బిగ్ బాస్ సీజన్-6 లో టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకడిగా నిలిచాడు. బిగ్ బాస్ నుండి వచ్చాక బిబి జోడీలో కూడా డ్యాన్స్ చేశారు. అయితే వీరిద్దరు తమ డాన్స్ తో అందరిని అంతగా మెప్పించలేకపోయారు. దాంతో బిబి జోడి నుండి ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ లో రోహిత్ భార్యపై చూపించే ప్రేమ కేరింగ్ కి అందరూ ఫిదా అయ్యారు. దాంతో అతడికి ఫ్యాన్ బేస్ పెరిగింది. ప్రస్తుతం తమ సొంత యూట్యూబ్ ఛానెల్ లో భార్య భర్తల మీద జోక్స్, పంచ్ లు, ఛాలెంజ్ లు అంటు ఇద్దరు కలిసి వ్లాగ్స్ చేస్తున్నారు. కాగా ఇప్పుడు మెరీనా-రోహిత్ చేసిన లడ్డు మేకింగ్ ఛాలెంజ్ వ్లాగ్ కి విశేష స్పందన లభిస్తుంది.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.