English | Telugu

వైరల్ గా మారిన మెరీనా పోస్ట్‌!

బిగ్ బాస్ హౌస్ లోకి 'మెరీనా-రోహిత్' ఇద్దరు జంటగా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. హౌస్ లోకి వచ్చాక కొన్ని రోజులు జంటగా ఆడగా, ఆ తర్వాత ఇద్దరిని సపరేట్ గా ఆడమన్నాడు బిగ్ బాస్. కాగా మెరీనా గతవారమే ఎలిమినేట్ అయి బయటికొచ్చేసింది. అలా బయటకొచ్చాక తన భర్తకి సపోర్ట్ చెయ్యండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌ లు చేస్తుంది మెరీనా.

ఒక పోస్ట్ లో మెరీనా "చివరి వారంలో రోహిత్ ని ఎక్కువగా చూపించలేదు. కావాలని తనని టార్గెట్ చేసారు. తను ఎక్కువగా ఓపెన్ గా మాట్లాడడు. అందుకే అందరూ అతడిని నామినేట్ చేసారు" అంటూ రాసుకొచ్చింది. ఇప్పుడు ఆమె రాసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

అయితే సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో అందరూ కూడా రోహిత్ ని నామినేట్ చేసిన విషయం తెలిసిందే. "ఎక్కువ ఏ విషయాన్ని ఓపెన్ గా చెప్పడు తను.. అందుకే నామినేట్ చేసారు. అలా చేసినందుకు తన లైఫ్ లో జరిగిన సంఘటనలను పోస్ట్ రూపంలో ప్రేక్షకులతో పంచుకుంది. "ఎప్పుడూ కూడా రోహిత్ ఏ విషయాన్ని అంత తొందరగా వ్యక్తం చేయడు. చాలా రిజర్వు గా ఉంటాడు. కానీ నామినేషన్ లో చాలా క్లారిటీగా తన మనసులో ఏం ఉందో, అది హౌస్ మేట్స్ అందరితో చెప్పాడు. అంతా కూడా స్పష్టంగా చెప్పాడు. చాలా రోజుల తరువాత తను అలా ఓపెన్ అవ్వడం చూసాను. 'ఐ యామ్వెరీ హ్యాపీ.. ప్లీజ్ సపోర్ట్ హిమ్' అంటూ సోషల్ మీడియాలో మరొక పోస్ట్ చేసింది మెరీనా.

హౌస్ లో అన్ డిజర్వింగ్ కంటెస్టెంట్ గా ఉన్న రోహిత్, ఇప్పుడు టాప్ 5 లోనే కాకుండా రన్నర్ స్థానానికి వెళ్ళాడు. "Rohith is Genuine and Honest Player in this House" అంటూ రోహిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ సపోర్ట్ ని తెలియజేస్తున్నారు. అయితే రోహిత్ రన్నరా? విన్నరా? అనే విషయం తెలియాలంటే ఇంకో రెండు వారాలు ఆగాల్సిందే మరి!

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.