English | Telugu
దాని వెనుక ఉన్న నా బాధ తెలియట్లేదా వసుధార!
Updated : Feb 13, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ ఎపిసోడ్ -684 లోకి అడుగుపెట్టింది. కాగా శనివారం రోజు జరిగిన ఎపిసోడ్ లో రిషి, వసుధారల మధ్యలో పెద్ద మాటల యుద్ధమే జరుగుతుంది. వసుధార ఒక్కతే ఆటోలో వెళ్లి పోయింది. రిషి ఇంటికి రాగానే డాడ్ డాడ్ అంటూ వెళ్లేసరికి.. "మహేంద్ర, రిషి వచ్చాడు" అని జగతి చెప్పేసరికి.. మహేంద్ర పడుకున్నట్లు నటిస్తాడు. డాడ్ కడుపు నొప్పి తగ్గిందా అని అడుగుతాడు రిషి. నువ్వు వెళ్లిన పని ఏమైంది కాయా? పండా? అని మహేంద్ర అడుగుతాడు. నేను పిల్లలకి కిట్స్ ఇవ్వడానికి మాత్రమే వెళ్ళాను. నేనేదో టెండర్ వెయ్యడానికి వెళ్లినట్లు అలా అడుగుతున్నారేంటని రిషి అడుగుతాడు. ఏమైనా తీసుకున్నారా డాడ్ అని టేబుల్ మీద ఉన్న కాషాయం ని ఇచ్చి తాగమంటాడు. అది తాగకుంటే ఎక్కడ యాక్టింగ్ అని తెలిసిపోతుందో అని బలవంతంగా తాగుతాడు మహేంద్ర. జగతి చాటున మూసి మూసి నవ్వులు నవ్వుతుంది. ఆ సీన్ అంత కూడా కామెడీగా నడుస్తుంది..
ఆ తర్వాత రిషి తన గదిలోకి వెళ్ళి వసుధారని బాధపెట్టానా? తప్పు చేసానా అని ఆలోచిస్తూ.. వసుధారకి మిస్డ్ కాల్ ఇస్తాడు రిషి. అది చూసిన వసుధార, ఎన్నడూ లేనిది సర్ మిస్డ్ కాల్ ఇస్తున్నాడేంటి? నేను ఎందుకు కాల్ చెయ్యాలి.. నేను కూడా మిస్డ్ కాల్ ఇస్తా అని వసుధార కూడా మిస్డ్ కాల్ ఇస్తుంది. రిషికి కోపం వస్తుంది. రిషికి ఫోన్ చేస్తోంది వసుధార. ఏంటీ సర్ మిస్డ్ కాల్ ఇచ్చారు అని అడుగుగా... " నేను మిస్డ్ కాల్ ఇస్తే మళ్ళీ నువ్వు మిస్డ్ కాల్ ఇస్తావా అని అడుగుతాడు. అయితే ఏంటి సర్ ఇంకా అనాల్సినవి ఏమైనా ఉన్నాయా అని వసుధార అడుగగా.. ఏంటి నేను తిట్టడానికే ఫోన్ చేశా అని ఫిక్స్ అయ్యావా అని రిషి అంటాడు. మీరు ఇందాక చేసింది అదే కదా అని వసుధార అనగా కాసేపు ఇద్దరు వాదించుకుంటారు. తిట్టడమే గుర్తుందా? దాని వెనక ఉన్న నా బాధ తెలియట్లేదా అని రిషి అంటాడు. అన్ని మీరే మాట్లాడతారా నన్నేం మాట్లాడనివ్వరా అని వసుధార అంటుంది. నేనే మాట్లాడుతాను.. నీకు ఛాన్స్ ఇస్తే నువ్వు ఏం మాట్లాడతావో నాకు తెలుసు. నీ అంత అందంగా నాకు మాట్లాడం రాదు.. నాకు ప్రేమ తెలుసు.. బంధం తెలుసు.. స్నేహం తెలుసు అని రిషి అంటాడు. అంటే అవేం నాకు తెలియవా సర్.. మీరు కూడా నాకు పరీక్షలు పెడుతున్నారు సర్ అని కోపంగా వసుధార అంటుంది. నువ్వు పరీక్షలు పెట్టడంలో గొప్పదానివి.. యూత్ ఐకాన్ వి.. నీతో నేను ఎలా పోటీ పడగలను అని రిషి కోపంగా ఫోన్ కట్ చేస్తాడు.
మరో వైపు జగతి, మహేంద్రల దగ్గరికి దేవయాని వచ్చి అయిపోయిందా మీ కడుపు నొప్పి నాటకం.. కావాలనే రిషి, వసుధారలను బయటకి పంపించారు కదా.. మీరు మాట్లాడుకున్నది అంతా నేను విన్నానని దేవయాని అడుగుతుంది. ఇలా చాటుగా వినడం మీకు ఇష్టమైన పనా అక్కయ్యా అని జగతి అంటుంది. "అవును వదిన కావాలనే పంపించాం ఏం చేస్తారు" అని మహేంద్ర అనగా ఇప్పుడే వెళ్లి రిషికి చెప్తానని దేవయాని అంటుంది. చెప్పండి వదిన మీరు చేసిన నాటకాలు ఎన్ని లేవు.. అవన్నీ మేం కూడా చెప్తామని మహేంద్ర అనడంతో.. ఇలా ఎదురు తిరుగుతున్నారేంటి అని అనుకొని అక్కడి నుండి వెళ్లిపోతుంది దేవయాని. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.