English | Telugu
సిరికి లవ్ ప్రపోజ్ చేసిన తన అభిమాని!
Updated : Apr 26, 2023
సిరి హనుమంత్.. బిగ్ బాస్ లోకి వెళ్ళొచ్చాక బాగా ఫేమస్ అయింది. తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. యూట్యూబ్ లో లఘుచిత్రాలతో మొదలైన సిరి కెరీర్.. ఒక సెలబ్రిటీ హోదాలోకి చేరింది. యూట్యూబ్ లో హిట్ అయిన వెబ్ సిరీస్‌లలో సిరి హనుమంత్ నటించినవి బోలెడు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉండేవారిలో సిరి హనుమంత్ ఒకరు. ఇటీవల తను 'పులి-మేక' వెబ్ సిరీస్ లో ఒక కీలకపాత్ర చేసిన విషయం తెలిసిందే. అయితే 'పులి-మేక' రెండవ పార్ట్ ఉంటుందా అనేదానికి సంబంధించిన అప్డేట్ ని ముందుగానే చెప్పేసింది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో 'ఆస్క్ మీ ఏ క్వశ్చన్' ని పోస్ట్ చేసిన సిరి అందులో కొన్ని ఆసక్తికరమైన సమాధానాలు చెప్పుకొచ్చింది.
ఒక అభిమాని 'పులి-మేక' పార్ట్-2 ఎప్పుడు ఉంటుంది అని క్వశ్చన్ అడుగగా.. ఈ జూన్ లో షూటింగ్ మొదలవుతుందని సిరి చెప్పింది. శ్రీహాన్ ఇన్ స్టా యూజ్ చేయడా అక్క అని ఒకరు అడుగగా.. చాలా తక్కువ యూజ్ చేస్తాడని సిరి రిప్లై ఇచ్చింది. మీ ఫోన్ గ్యాలరీలో మొదటి పిక్ ఏంటని ఒకరు క్వశ్చన్ చేయగా.. శ్రీహాన్ తో కలిసి దిగిన ఫోటోని అప్లోడ్ చేసింది సిరి.ఆ తర్వాత మరొక అభిమాని.. "సిరి నేను రెండు సార్లు క్వశ్చన్స్ అడిగాను.. నువ్వు ఒక్కసారి కూడా రిప్లై ఇవ్వలేదు.. ప్లీజ్ రిప్లై ఇవ్వు సిరి.. లవ్ యూ" అని అడుగగా... హే అని రిప్లై ఇచ్చింది సిరి. దీంతో తన ప్రపోజ్ కి సిరి కోప్పడిందా? లేక ఇంప్రెస్ అయిందా? అని ఆ అభిమాని కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. కంగ్రాట్స్ ఫర్ 100K సబ్ స్కైబర్స్ ఆన్ యూట్యూబ్.. లవ్ ప్లీజ్..కమ్ లైవ్ అని ఒక అభిమాని అడుగగా.. యా థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.. యూట్యూబ్ లో మా ఛానెల్ స్టార్ట్ చేసిన నెలన్నరకే లక్ష సబ్ స్క్రైబర్స్ రావడమనేది.. నిజంగా థాంక్స్.. మీ వల్లే ఇదంతా సాధ్యమని సిరి సంతోషం వ్యక్తం చేసింది.