English | Telugu
ముకుందని ఇంటికి వెళ్ళిపోమన్న భవాని.. వద్దన్న కృష్ణ!
Updated : Oct 12, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -286 లో.. ఏసీపీ సర్ ఇంట్లో లేని టైమ్ లో భవాని అత్తయ్యకి ఆదర్శ్ రాడన్న విషయం చెప్పావ్ అంటే నాకు ఏదో డౌట్ గా ఉందని ముకుందతో కృష్ణ అంటుంది. ఇందులో డౌట్ ఏం ఉందని ముకుంద అనగానే.. తేలుస్తా అన్ని విషయలు తేలుస్తా అని కృష్ణ చెప్తుంది. నాది మురారిది ఒకటే మాట అని ముకుంద కాన్ఫిడెంట్ గా కృష్ణకి చెప్తుంది. కానీ ముకుంద అబద్ధం చెప్పిందని కృష్ణకి స్పష్టంగా అర్థం అవుతుంది.
మరొక వైపు భవానికి రేవతి భోజనం తీసుకొని వెళ్తుంటే కృష్ణ ఆపి.. నేను తీసుకొని వెళ్తానని భోజనం భవాని దగ్గరకి తీసుకొని వెళ్తుంది. కృష్ణ భవాని గదిలోకి వెళ్లేసరికి భవాని చీకటిలో కూర్చొని బాధపడుతుంటుంది. అత్తయ్య మీరు బాధపడకండి. ఆదర్శ్ ఖచ్చితంగా వస్తాడని భవానికి కృష్ణ ధైర్యం చెప్తుంది. రాడని అంత ఖచ్చితంగా చెప్తుంటే.. ఎలా వస్తాడని భవాని అడుగుతుంది. ఆ తర్వాత అంతా ఆలోచించిన భవాని.. ముకుంద నువ్వు మీ పుట్టింటికి వెళ్ళు అని అంటుంది.
అలా అనగానే.. ఏంటి కథ అడ్డం తిరిగిందని ముకుంద షాక్ అవుతుంది. వద్దు అత్తయ్య.. నాకు ఒక వారం టైమ్ ఇవ్వండి ఆదర్శ్ ని తీసుకొని వస్తానని భవానికి కృష్ణ చెప్తుంది. అది విన్న తర్వాత కృష్ణ చెప్పిన దానికి భవాని ఒప్పుకుంటుంది. ఆ తర్వాత కృష్ణ ఆలోచిస్తుంటే రేవతి తన దగ్గరకి వచ్చి.. ఎందుకు ముకుందని వాళ్ళింటికి వద్దన్నావని అడుగుతుంది. ముకుంద ఎక్కడికి వెళ్ళదు. ఈ ఇంటిని వదిలిపెట్టి ఎక్కడకి వెళ్ళదు. ఎందుకంటే దానికి కారణం ఏసీపీ సర్ అని అనగానే.. కృష్ణకి నిజం తెలిసిపోయిందా అని రేవతి షాక్ అవుతుంది. ఏసీపీ సర్ మీద ఉన్న ప్రేమ వల్ల తను ఎక్కడికి వెళ్ళదు. నాకు అంతా తెలుసు అత్తయ్య. కానీ ఏసీపీ సర్ మనసులో ముకుంద లేదు అన్న విషయం కూడా తెలుసు.
ఎలాగైనా ఆదర్శ్ ని వెతికి తీసుకొని వస్తాను. అందుకే చెప్పానని కృష్ణ అనగానే.. రేవతి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరి ముకుంద ప్రేమిస్తుంది కదా అని ఇంటి నుండి ఏడుస్తూ నీ కోడలు వెళ్ళిపోతుందని అనుకున్నావా అని కృష్ణ అనగానే.. నువ్వు నా బంగారం అని కృష్ణని పొగుడుతుంది రేవతి.
మరొకవైపు ఏంటి కృష్ణ ఇలా చేసిందని మధు అనుకుంటాడు. అప్పుడే కృష్ణ వస్తుంది. ఏంటి కృష్ణ.. ముకుందని బయటకి పంపిస్తావని అనుకుంటే ఎందుకు వద్దన్నావని అడుగుతాడు. ముకుంద చెప్పింది అబద్ధం.. ఆదర్శ్ ని వెతికి తీసుకొని రావాలని కృష్ణ అనగానే.. నీకు సపోర్ట్ గా నేను ఉంటానని కృష్ణకి మధు చెప్తాడు. కాసేపటికి ఆ విషయం వెళ్లి అలేఖ్య చెప్తాడు. మరొక వైపు కృష్ణ అన్న మాటలు భవాని గుర్తుకుచేసుకొని.. కృష్ణ మీద నమ్మకం ఉంది ఎలాగైనా ఆదర్శ్ ను తీసుకొని వస్తుందని భవాని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.