English | Telugu
శోభా శెట్టి ఎలిమినేషన్.. డేంజర్ జోన్ లో ప్రియాంక జైన్, అమర్ దీప్!
Updated : Oct 12, 2023
అనుకున్నదే అయింది.. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చినట్టుగా తెలుస్తుంది. నామినేషన్లో మొత్తం ఏడుగురు ఉండగా.. అతి ఎక్కువ మెజారిటీ ఓటింగ్ తో యావర్ మొదటి స్థానంలో ఉండగా..
కొత్తగా వచ్చిన హౌజ్ మేట్స్ నయని పావని, పూజా మూర్తి, అశ్విని శ్రీ తర్వాతి స్థానాలలో ఉండగా చివరి మూడు స్థానాలలో అమర్ దీప్, ప్రియాంక జైన్ ఉండగా.. చిట్ట చివరి స్థానంలో శోభాశెట్టి ఉంది. దీంతో ఈ వారం శోభా శెట్టి ఎలిమినేషన్ గ్యారెంటీ అనిపిస్తుంది. అయుతే చివరి రోజు వరకు ఎంత ఓటింగ్ జరిగిన అమర్ దీప్, ప్రియంక జైన్, శోభా శెట్టి లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని ప్రేక్షకులు భావిస్తున్నారు.
సీరియల్ బ్యాచ్ లో ఎవరూ తక్కువ కాదనట్టుగా చేస్తుంటారు. ఆట సందీప్ తన స్ట్రాటజీతో అమర్ దీప్ ని లెటర్ చదవకుండా డ్రాప్ అయ్యేలా చేశాడు. శోభా శెట్టి ప్రతీ ఆటలో ఫౌల్ గేమ్ ఆడుతు, ఎవరైనా ఎదురుతిరిగితే వారితో వితండవాదం చేయడం, ఏమైనా అంటే ఆడవాళ్ళతో ఇలాగేనా మాట్లాడటమని సింపతీ గేమ్ ప్లే చేస్తుంది. ఇక ప్రియాంక కంటెంట్ కోసం కావలనే కిచెన్ లో లీడర్ గా, వంటలక్కలా అవ్వాలని ట్రై చేస్తుంది. ఇక అమర్ దీప్ ది అమాయకత్వవమో లేక అతని తెలివితేటలే ఇంతనా అనిపిస్తుంది. ఇక గ్యాప్ దొరికితే నలుగురు కలిసి.. నువ్వు వాడిని టార్గెట్ చేయు, నేను ఆమెని టార్గెట్ చేస్తా అంటూ డిస్కషన్ పెట్టుకుంటున్నారు.
ఇప్పటిదాకా జరిగిన టాస్క్, గేమ్స్ లలో ప్రియంక జైన్, శోభా శెట్టి, అమర్ దీప్ అంతగా పర్ఫామెన్స్ ఇవ్వలేదు. కొత్త కంటెస్టెంట్స్ కి ఓట్ల శాతం ఎక్కవ వస్తుంది. ఇక అంబటి అర్జున్ ఫెయిర్ ప్లే ఆడుతూ శివాజీ దగ్గర మెలుకువలు నేర్చుకుంటున్నాడు. ఇక ఇప్పుడిప్పుడే పల్లవి ప్రశాంత్ ని అర్థం చేసుకుంటున్న అమర్ దీప్.. శివాజీ గూటిక చేరినట్టువా అనిపిస్తుంది అయితే అమర్ దీప్ ప్రతీ టాస్క్ లో ఆడాలనుకొని ఆటగాళ్ళని ఓడిస్తూనే ఉన్నాడుమ ఇదే కంటిన్యూ అవుతే హౌజ్ లో ఈ సీరియల్ బ్యాచ్ కి మరింత కష్టంగా ఉంటుంది.
ఇక నామినేషన్లో ఉన్న ఈ ముగ్గురికి ఇంతకముందు పడే ఓటింగ్ కూడా పడకపోవడంతో శోభా శెట్టి ఎలిమినేషన్ గ్యారెంటీలా తెలుస్తుంది. మరి మోనిత ఈ వారం హౌజ్ నుండి ఎలిమినేట్ అవ్వనుందా లేక ప్రియాంక జైన్ అవ్వనుందా అనేది తెలియాల్సి ఉంది. ఇంక ఓటింగ్ కి ఒక్కరోజే మిగిలి ఉండడంతో ప్రస్తుతం కొనసాగుతున్న ఓటింగ్ ప్రకారం అయితే శోభా శెట్టి, ప్రియాంక జైన్ లలో ఎవరో ఒకరు బయటకు వెళ్ళడం గ్యారెంటీ అనిపిస్తుంది. అమర్ దీప్ ఈ రెండు రోజుల్లో సరిగ్గా ఆడకపోతే తనకి కూడా కష్టమే.