English | Telugu

మీరా కడుపులో ఉంది వాళ్ళ బిడ్డే.. నిజాలు బయటపెట్టిన మధు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి' (Krishna Mukunda Murari). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -485 లో.... మురారి గదిలో రిపోర్ట్స్ చూసి భవాని కుప్పకూలిపోతుంది. ఫైల్ పట్టుకొని కోపంతో కిందకి వెళ్తుంది. కృష్ణ అంటూ గట్టిగా అరుస్తుంది. అందరూ అక్కడికి వస్తారు. కృష్ణ ఏమైందా అని కంగారు పడుతుంది. ముకుంద మాత్రం కృష్ణని ఇన్ని రోజులు నెత్తిన పెట్టుకున్న అత్తయ్యే ఈరోజు నీ మీద పెద్దపులిలా పడుతుందని అనుకుంటుంది. కృష్ణ ఏమైంది అత్తయ్య అని అడిగితే భవాని ఎంత మోసం చేశావే అని చెంప మీద కొడుతుంది. అందరూ షాక్ అవుతారు. మీరా నవ్వుకుంటుంది. అక్కా కొట్టాల్సిన వారిని వదిలేసి దాన్ని ఎందుకు కొడతారు. అదేం తప్పు చేసిందని కొడుతున్నావని రేవతి అనగా.. ఏం తప్పు చేసిందా ఈ ఫైల్ చూడు నీకే తెలుస్తుందని భవాని అంటుంది. ఇక ఆదర్శ్ ఫైల్ చూస్తాడు.

పిన్ని నీ కొడుకు చేసినదానికి షాక్‌లో ఉంటే నీ కోడలు చేసిన నిర్వాకానికి ఏమైపోతావో. ఆస్కార్ రేంజ్‌లో వీళ్ల పెర్మామెన్స్. తల్లి కాబోతుంది అని తెగ సంబరపడిపోతున్నారు కదా పిన్ని అదంతా ఒట్టి నాటకం. ఏం లేదు అంతా వట్టిదే. నిజం పిన్ని అసలు ఈ కృష్ణ తల్లే కాదు. ఇప్పుడే కాదు ఈ జన్మలో తనకి పిల్లలు పుట్టే ఛాన్సే లేదు. కానీ తల్లిని కాబోతున్నట్లుగా వారసుడిని ఇవ్వబోతున్నట్లు మా అమ్మని మాయ చేశారు. మరి మా అమ్మకు కోపం రాదా అని ఆదర్శ్ ఆంటాడు. ఏంటే ఇది వాడు చెప్పేది నిజమా. ఈ రిపోర్ట్ నిజమేనా. నువ్వు కూడా మోసం చేశావా కృష్ణ. నిన్ను కన్నబిడ్డలా చూసుకున్నా కదా. నువ్వు నన్ను మోసం చేశావు అన్న నిజం ఈ గుండె తట్టుకోలేకపోతుంది. దీని కంటే చావు హాయిగా ఉంటుందేమోనని రేవతి అనగానే.. చూడు చూడు.. ఎందుకు ఇంత పని చేశావ్. మాకు ఎందుకు లేనిపోని ఆశలు కల్పించావ్. మాకు ఎందుకు ఇంత మోసం చేశావు. పిల్లలు పుట్టకపోతే బయటకు పంపేస్తానా అంత కసాయిదానిలా కనిపిస్తున్నానా నేను. నువ్వు పిల్లల్ని కని నా చేతిలో పెడితే సంతోషిస్తాను కానీ ఇలా మోసం చేస్తే సహించను. పెద్దత్తయ్య నాకు పిల్లలు పుట్టే యోగం లేదు అని ఒక్కమాట చెప్తే జాలి పడి నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసేదాన్ని కదే. కానీ ఈరోజు నువ్వు నా గుండెల్ని ముక్కలు చేశావు కదే అని భవాని అంటుంది. మనసులో ఎంత పని చేశావ్ ముకుంద. ఏ నిజం బయట పడకూడదు అనుకున్నానో అది బయటపెట్టేలా చేశావ్. తన బిడ్డకు ఏసీపీ సార్ తండ్రి అని చెప్పి మళ్లీ నాకు పిల్లలు పుట్టరని ఏ ధైర్యంతో చెప్పింది. ఇంత జరిగినా నేను ఎందుకు మౌనంగా ఉండాలి సరోగసీ గురించి చెప్పేస్తా అని కృష్ణ అనుకుంటుంది. నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది. కడుపుతో ఉన్న నువ్వు నార్మల్‌గా ఉన్నావ్. మీరా వాంతులు చేసుకుంటుందని అప్పుడే అన్నాను కదా.. అయినా ఇంత దారుణంగా ఎవరినీ మోసం చేయకూడదు కృష్ణ తప్పు అని రజినీ అంటుంది.

ఇక అందరు కృష్ణని తిట్టేసి వెళ్ళిపోతారు. మధుతో కృష్ణ జరిగిందంతా చెప్తుంది. ముకుంద కడుపులోని బిడ్డ మా బిడ్డ అని మధుతో కృష్ణ చెప్పాక.. పదా పెద్దమ్మకి చెప్తే అర్థం చేసుకుంటుందని మధు అంటాడు. ఇక భవాని, రేవతిల దగ్గరికి మధు వెళ్లి.. మీరా కడుపులోని బిడ్డ వాళ్ళ బిడ్డే.. కృష్ణకు పిల్లలు పుట్టరని తెలిశాక సరోగసీ పద్ధతిలో తమ బిడ్డను మీరా కడుపులో పుట్టాలనుకున్నారు అంతే అని మధు ఆంటాడు. నువ్వు చెప్పేది నిజమేనా. మీరా కడుపులో పెరుగుతున్న బిడ్డ నా వారసుడా అని భవాని అంటుంది. మీ కొడుకు ఏ తప్పు చేయలేదు అన్నావ్ ఇందు కోసమేనా. ఆ బిడ్డ మీ బిడ్డేనా చెప్పమని రేవతి అనగానే.. అవునని కృష్ణ అంటుంది. ఇదంతా అబద్ధం. ఇది నా బిడ్డ మురారి వల్ల నాకు కలిగిన బిడ్డ. ఎక్కడ మురారి తనకు కాకుండా పోతాడా అని మధుతో కలిసి నాటకం ఆడుతుందని మీరా అనగానే.. ఇంకొక్క మాట మాట్లాడితే నాలుక కోసేస్తా. ఇది మురారి మీద కన్నేసింది. ఇంతలో కృష్ణకు పిల్లలు పుట్టరు అని తెలుసుకొని అసలు నాటకం మొదలు పెట్టిందని మధు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.