English | Telugu

ఆదర్శ్ మాటలకు మీరా ఫిదా.. అతను లేకపోయుంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -462 లో... ఆదర్శ్, మీరా మాట్లాడుకుంటారు. ఈవినింగ్ ఫ్రీనేనా? అని మీరాని ఆదర్శ్ అడుగగా.. ఫ్రీ అయితే సోది పెడతాడా వచ్చి అని మీరా మనసులో అనుకుంటుంది. మీరు ఫ్రీ లేకపోయిన నాతో పాటు షాపింగ్‌కి రావాలని అదర్శ్ అంటాడు. షాపింగ్‌ కా? నాకు సెలక్షన్ అసలు రాదండి. పైగా మగవారి బట్టల గురించి నాకు అసలు తెలియదని మీరా అంటుంది. అయ్యో.. నేను తీసుకునేది నాకు కాదు ముకుంద.. నీకే చీరలు తీసుకుందామని రమ్మంటున్నాను.. నువ్వు ఈ ఇంటికి వచ్చిన మొదట్లో మా అమ్మ కొన్న బట్టలతో ఉంటున్నావ్. ఈ ఇంట్లో అంతా కట్టిన బట్టలు కట్టకుండా తిరుగుతుంటే.. నువ్వు మాత్రం పదే పదే కట్టిన చీరలే కడుతున్నావ్. అది నాకు నచ్చడం లేదు.. అందుకే చీరలు కొనిస్తాను నువ్వు తీసుకోవాల్సిందేనని ఆదర్శ్ అంటాడు. ఆ మాటలకు మీరా కరిగిపోతుంది.

మీది ఎంత మంచి మనసు ఆదర్శ్ గారు.. నా కోసం ఎంత ఎక్కువగా ఆలోచిస్తున్నారని అనుకుంటుంది. నేను ముకుందగా ఉన్నప్పుడు కూడా ఇంత శ్రద్ధ ఎవ్వరూ చూపించలేదు.. కానీ అదంతా వృధానే ఆదర్శ్ గారు. ఎందుకంటే ఈ జన్మకు మురారీనే నా జీవితం.. ఇంకెవ్వరికీ చోటు ఉండదని మీరా అనుకుంటుంది. ఏం ఆలోచిస్తున్నావ్ ముకుందా అని ఆదర్శ్ అంటాడు. ఏం లేదు అనవసరంగా డబ్బుల ఖర్చు ఎందుకని మీరా అంటుంది. అవును కోటి రూపాయాల చీరలు కొంటున్నాం మరి.. డబ్బు ఖర్చు.. ఈవినింగ్ సిద్ధంగా ఉండు వెళ్దాం.. సరేనా అని ఆదర్శ్ అంటాడు. హా సరే తప్పకుండా వెళ్దామని మీరా అంటుంది. థాంక్యూ అనేసి ఆదర్శ్ వెళ్లిపోతాడు. నేను ముకుందను కాకుండా ఉండి ఉంటే నాకు మురారీ లేకపోయి ఉంటే ఎప్పుడో మీ ప్రేమకు పడిపోయి ఉండేదాన్ని ఆదర్శ్ గారు.. బ్యాడ్ లక్ అని మీరా మనసులో అనుకుంటుంది. ఇక ఆదర్శ్ వైపు ముకుంద ప్రేమగా అభిమానంగా చూస్తుందని భవాని అనుకుంటుంది.

మరోవైపు సరోగసీ మదర్ దొరికిందంటు కృష్ణకి వైదేహీ కాల్ చేసి చెప్పగా.. మురారీ, కృష్ణ ఇద్దరు హాస్పిటల్ కి వెళ్తారు. అక్కడ ఫైల్ మీద సంతకాలు చేసి.. ఆ సరోగసి మదర్ ఎవరో చెప్పండి.. మాకు పరిచయం చేయండి అంటు కృష్ణ, మురారి రిక్వెస్ట్ చేస్తారు. రూల్స్, కండీషన్స్ అంటూ తప్పించుకుంటుంది. నిజం మాత్రం చెప్పదు. దాంతో.. ‘మరో మార్గంలో ఆ సరోగసి మదర్ కోసం వెతకాలి.. తను ఎవరో తెలుసుకుని తనని మనతో పాటు ఉంచుకోవాలి.. జాగ్రత్తగా చూసుకోవాలి’ అని ఫిక్స్ అవుతారు మురారీ, కృష్ణలు. ఇక కృష్ణను క్యాబ్‌లో ఇంటికి పంపించి మురారి ఆ పనిలో ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.