English | Telugu

నీకు ఇష్టముంటే తిను,లేకపోతే పో.. నా రేట్లు ఇంతే : కిర్రాక్ ఆర్పీ!

ఆర్పీ చేపల పులుసుకి ఫుడ్ బిజినెస్ లో క్రేజ్ వచ్చింది. అయితే దానితో పాటు నెగెటివిటి కూడా పెరిగింది. హైదరాబాద్ లో బిజినెస్ మంచిగా సాగుతుందనగా వెంట వెంటనే మూడు నాలుగు బ్రాంచ్ లు ఓపెన్ చేసాడు ఆర్పీ. అయితే వాటికి ఉండే డిమాండ్ ని బట్టి క్వాలిటీని బట్టి ధర ఉంటుందంటు ఆర్పీ ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

పెళ్లికి ముందే హైద‌రాబాద్‌లో నెల్లూరు పెద్దారెడ్డి చేప‌ల పులుసు పేరిట క‌ర్రీ పాయింట్ బిజినెస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. కూకట్‌ పల్లి, అమీర్‌పేట్‌లోనూ అతనికి బ్రాంచ్‌లున్నాయి. స్టాల్స్‌ ప్రారంభం నుంచే ప్రజల నుంచి అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది. వ్యాపారం విజ‌య‌వంతం కావ‌డంతో ఆర్పీ ముంద‌డుగు వేసి నెల్లూరు పెద్దారెడ్డి చేప‌ల పులుసు పేరిట‌ ప‌లు బ్రాంచ్‌లు ఓపెన్ చేశాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆర్పీ తన బిజినెస్‌ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మీ వద్ద ధరలు అధికంగా ఉన్నాయంటున్నారు? అని యాంకర్ ప్రశ్నించగా.. ఆర్పీ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. నా బిజినెస్‌ నా ఇష్టం.. నా రేట్లు అంతే అంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు.

ఆర్పీ మాట్లాడుతూ..'ఇది నా బిజినెస్. నా రేట్లు ఇంతే. చేపలకు, మిగతా వాటికి చాలా తేడా ఉంటుంది. ఆడి, బెంజ్, క్రెటా కార్లలో నీ స్తోమతను బట్టి తీసుకుంటాం. ఇది కూడా అంతే కొనగలిగే కెపాసిటీ ఉన్నవాళ్లే తీసుకుంటారు. అంతే తక్కువ రేటు అని చెప్పి.. ఎలా పడితే అలా ఇవ్వలేను కదా. మేమ్ మొత్తం క్వాలిటీ ఉత్పత్తులు మాత్రమే వాడతాం. నా చేపల పులుసు నీకు అందుబాటు రేటులో ఉంటేనే తిను. లేకపోతే వద్దు. కొందరు కావాలనే నాపై అలాంటి ప్రచారం చేస్తుంటారు. నీకు ఇష్టముంటే తిను. లేకపోతే పో. నా చేపల పులుసు రేట్లు అంతే. అంతేకానీ రూ.100 జేబులో పెట్టుకుని.. రూ.1000 ఫుడ్ కావాలంటే వస్తుందా? మా చేపల పులుసు తినమని నేను ఎవరినీ బతిమాలాడను కదా? రేట్లు ఎంత పెట్టాలి అనే విషయం నాకు తెలుసు. నాది కూడా వ్యవసాయం కుటుంబమే. ఎవరెన్ని చేసిన ఐ డోంట్‌ కేర్‌. నా చేపల పులుసుపై నాకు నమ్మకముంది' అని అన్నారు. మరి నెల్లూరు చేపల పులుసు మీరు తిన్నారా? తింటే ఆ క్వాలిటీ ఎలా ఉందో కామెంట్ చేయండి.


Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.