English | Telugu
ధనరాజ్ అంటే మినిమం ఇట్టా ఉండాలే.. గవాస్కర్, కపిల్‌తో ఫొటోలు!
Updated : Jul 6, 2022
ధనరాజ్ అటు మూవీస్‌లో, ఇటు రియాలిటీ షోస్‌లో చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ , కమెడియన్. ప్రస్తుతం ధనరాజ్ యూఎస్ లో కొన్ని ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్లి అక్కడి వాళ్ళను అలరిస్తున్నాడు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ధనరాజ్ కొన్ని ఫొటోస్ షేర్ చేసి ఫుల్ వైరల్ అవుతున్నాడు. లెజెండరీ క్రికెటర్స్ ఐన కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ లతో కలిసి ఎప్పటికీ మరిచిపోలేని కొన్ని క్షణాలను ఫోటోలు తీసుకుని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశాడు. "చిన్నప్పటి నుండి ఈ ఇద్దరితో మాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి.. సర్ ఇది నాకు ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతమైన క్షణం" అంటూ కాప్షన్ పెట్టి ఈ ఫొటోస్ షేర్ చేసాడు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలోఅభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
వెస్టిండీస్ అగ్రశ్రేణి క్రికెటర్ ఐన క్రిస్ గేల్‌తో కలిసిఒకసెల్ఫీని దిగి దాన్ని కూడా పోస్ట్ చేసాడు. ఇక ఇప్పుడు ధనరాజ్.. శ్రీముఖి, రవి, సునీత, అడివి శేష్, అషు, మంగ్లీ, రవి, రఘు అలాగే ఇంకొంతమంది సెలబ్రిటీస్ తో కలిసి యూఎస్ లో కొన్ని కల్చరల్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. 'కామెడీ స్టార్స్ ధమాకా'తో ధనరాజ్ అందరినీ అలరిస్తున్న విషయం తెలిసిందే. అలాగే 'పార్టీ చేద్దాం పుష్ప'లో కూడా స్కిట్స్ తో ఆడియన్స్ ని బాగా అలరిస్తున్నాడు.
'జబర్దస్త్'లో కొంతకాలం చేసిన ధనరాజ్ తర్వాత ఆ షోని వదిలేసి మూవీస్ వైపు వెళ్ళాడు. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ వన్ లో అవకాశం వచ్చేసరికి కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసాడు. అలా ఇటు టీవీని అటు సినిమాలను బాలన్స్ చేస్తూ వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటున్నాడు ధనరాజ్.