English | Telugu

అరియనా చంకనెక్కిన అష్షు..వైరల్ అవుతున్న ఫోటో

అష్షు రెడ్డి సోషల్ మీడియాలో హైలైట్ కావడానికి ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. తన షూట్స్ కి సంబంధించిన వీడియోస్, ఫామిలీ పిక్స్, అప్పుడప్పుడు కొన్ని హాట్ ఫొటోస్ , ఆర్జీవీతో కలిసి బర్త్ డే ఫంక్షన్ చేసుకున్న ఫొటోస్ అన్ని కూడా తన ఫాన్స్ తో షేర్ చేసుకుంటుంది. ఇప్పుడు అష్షు రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో మరో యాంకర్ అరియనాతో కలిసి ఒక వెరైటీ పోజ్ లో కనిపించింది.

ఈ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్..అంతేకాదు వీళ్ళిద్దరూ ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసి పాపులర్ ఐనవాళ్లు. ఇక ఇప్పుడు అరియానా చంకనెక్కింది అష్షు పాప. అష్షు అప్పుడప్పుడు షోస్, ఈవెంట్స్ లో కనిపిస్తూ ఉంటుంది. ఆరియానా ప్రస్తుతం బీబీ కేఫ్ లో చేస్తోంది. ఈ ఇద్దరూ కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్స్..ఇక వీళ్ళిద్దరూ ఎప్పుడూ సోషల్ మీడియాలో ఏదో ఒక విధంగా ట్రోల్ అవుతూనే ఉంటారు. ఇలా వీళ్ళు ఈ ఫోటోని పోస్ట్ చేసి ఫుల్ ఫన్ క్రియేట్ చేశారు. "నేను బాధల్లో ఉన్నప్పుడు నన్ను బాగా ఓదారుస్తావ్" అనే అర్థంలో కాప్షన్ కూడా పెట్టుకుంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.