English | Telugu
అపర్ణకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కావ్య!
Updated : Aug 6, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -167 లో... కాంట్రాక్టు వచ్చినందుకు రాజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అక్కడే ఉన్న మేనేజర్ ని పిలిచి.. ఆ కళావతికి కంపెనీ డిజైనర్ గా అఫీషియల్ లెటర్ ఇవ్వమని చెప్తాడు. అక్కడే ఉన్న శృతి.. మీ ఆవిడ పేరు కళావతి కాదు సర్ కావ్య అని అనగానే.. రాజ్ కోపంగా చూస్తాడు.
మరొక వైపు కావ్య కోసం అపర్ణ కోపంగా ఎదురుచూస్తుంటుంది. అప్పుడే కావ్య వచ్చి లోపలికి వెళ్తుంటే అగమని అపర్ణ అంటుంది. ఎక్కడికి వెళ్ళావ్ అత్తగారి సొమ్ముని అమ్మ వాళ్ళింటికి జారవేసి వచ్చావా అని అపర్ణ అడుగుతుంది. అందరూ ఏమైందని హాల్లోకి వస్తారు. మన ఇంటి డబ్బులు వాళ్ళ ఇంట్లో ఇవ్వడానికి వెళ్ళిందని అపర్ణ వాళ్లతో చెప్తుంది. అవును వెళ్ళాను అందులో తప్పు ఏముందని కావ్య అంటుంది. తప్పు లేదు.. నా కొడుకుకి మాయమాటలు చెప్పి డబ్బులు అడిగి తీసుకుపోవడం తప్పని అపర్ణ అంటుంది. దొరికింది ఛాన్స్ అన్నట్టుగా రుద్రాణి కావ్య పుట్టింటివారిపై పడుతుంది. వాళ్ళ అమ్మ వాళ్ళు ఎలా తీసుకున్నారు.. సిగ్గులేకుండా అని రుద్రాణి అనగానే.. సిగ్గు గురించి మీరు మాట్లాడుతున్నారా అని కావ్య అంటుంది. నేనేం డబ్బులు వట్టిగా అడిగి తీసుకొని వెళ్ళలేదు. నేను రాత్రంతా కష్టపడి డిజైన్స్ వేసి ఆ డిజైన్స్ నా భర్తకి అమ్ముకుంటే డబ్బులు ఇచ్చారు. నా కష్టార్జితం ఆ డబ్బు.. నేను ఖర్చుపెట్టుకుంటున్నా అని నా భర్తకి కూడా చెప్పానని కావ్య అంటుంది. ఇంట్లో పెద్ద వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి చెప్పాలని తెలియదా అని అపర్ణ అంటుంది. మీరు నన్ను ఒక మనిషిగా కూడా చూడనప్పుడు మీకెందుకు చెప్పాలి.. మా పుట్టింటికి సాయంగా ఉంటానని కావ్య చెప్పేసి వెళ్ళిపోతుంది. కావ్య మాటలకు అపర్ణకి కోపం వస్తుంది.
మరొక వైపు కృష్ణమూర్తి బొమ్మలకు రంగులు వేస్తుంటాడు. ఒకతను కృష్ణమూర్తి ఇంటికి వచ్చి వినాయకుడి బొమ్మలు కావాలి. దుగ్గిరాల ఇంట్లో వినాయకుని పూజకి మీరు ఇచ్చిన వినాయకుడి బొమ్మలు చాలా బాగున్నాయని అందరూ అంటున్నారు. అందుకే అలాంటివి కావాలని ఆ వచ్చిన అతను అంటాడు. సరే కానీ అప్పుడవి మా అమ్మాయి వేసినవి.. ఇప్పుడు మా అమ్మాయికి పెళ్లి చేసి పంపించామని, నేను అలాగే వేస్తానని కృష్ణమూర్తి అంటాడు. అవునా వద్దని చెప్పి అతను వెళ్ళిపోతాడు. ఆ కృష్ణమూర్తి బాధపడతాడు. మరొకవైపు అప్పు తన కవిత్వాన్ని వెటకారం చేసిందని భావించిన కళ్యాణ్.. తన అభిమాన పాఠకురాలు రాసిన లెటర్ ని అప్పుకు చూపిస్తాడు. అది చూపించినా అప్పు అలాగే మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.