English | Telugu

కనకం పర్ఫామెన్స్ ‌కి ఫిదా అయిన దుగ్గిరాల ఫ్యామిలీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్‌-52లో.. కొత్త కోడలిగా అడుగుపెట్టిన కావ్యని ప్రపంచమంతా పరిచయం చేయడానికి దుగ్గిరాల ‌కుటుంబం రిసెప్షన్ ని ఏర్పాటు చేసింది. అందులో మొదట జోకర్ పర్ఫామెన్స్ ని ప్రదర్శించారు. ఆ జోకర్ గా కావ్య అమ్మ కనకం చేసింది. ఆ పర్ఫామెన్స్ చూసి అందరూ చప్పట్లతో అభినందిస్తుంటే కావ్య కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. ఆ తర్వాత జోకర్స్ వేషంలో ఉన్న కనకంని సీతారామయ్య పిలిచి కావ్య చేతులమీదుగా కానుక ఇప్పిస్తాడు.

కావ్యని తమ బిజినెస్ పార్టనర్స్ కి పరిచయం చేయమని రాజ్ కి సీతారామయ్య చెప్తాడు. దాంతో కావ్యని రిక్వెస్ట్ చేసి తీసుకెళ్తాడు. అయితే అక్కడ వారితో ఇంగ్లీష్ లో కావ్య చక్కగా మాట్లాతుంది. అది చూసిన సీతారామయ్య.. మన కొత్త కోడలు ఇంగ్లీష్ అదరగొడుతుందని రాజ్ వాళ్ళ నానమ్మతో చెప్తాడు. అవునండి తనకి ఎక్కడ ఎలా ఉండాలో బాగా తెలుసని ఆమె సీతారామయ్యతో అంటుంది. అది చూసి రాజ్ వాళ్ళ అమ్మ అపర్ణ వచ్చి.‌. "అప్పుడే మంచిదని సర్టిఫికేట్ ఇవ్వకండి అత్తయ్య.. తను మంచిగా నటిస్తుంది.. ఆ ముసగు తీసేస్తే అసలు స్వరూపం బయటపడుతుంది" అని చెప్తుంది. మరోవైపు మారువేషంలో వచ్చిన స్వప్న రిసెప్షన్ లో రాహుల్ కోసం వెతుకుతుంది. రాహుల్ ని ఫాలో చేస్తూ వెళ్తుండగా ఇద్దరూ ఢీకొని కూల్ డ్రింక్ గ్లాసెస్ కిందపడి పగిలిపోతాయి. ఆ పగిలిన గాజు ముక్కలు స్వప్న ఏరుతున్నప్పుడు కావ్య తనని చూస్తుంది. స్వప్న దగ్గరగా కావ్య వెళ్ళినప్పుడు.. రాహుల్ అడ్డుగా వచ్చి స్వప్నని చూడకుండా ఆపేస్తాడు. ఆ తర్వాత తనొక కూల్ డ్రింక్స్ సర్వ్ చేసే అమ్మాయని కావ్యకి చెప్పి.. స్వప్నని అక్కడ నుండి తప్పించుకునేలా చేస్తాడు. ఆ తర్వాత స్వప్నని రాహుల్ కలిసి జరిగిన విషయాల గురించి మాట్లాడుకుంటారు.

రాహుల్ మాయమాటలు చెప్తూ స్వప్నకి అంతా నెగెటివ్ గా చెప్తుంటాడు. మీ చెల్లి కావ్య నిన్ను పంపించేసి, రాజ్ కి భార్యగా ఎంతలా రెడీ అయి వచ్చిందో చూసావా. నువ్వు వెళ్ళిపోయాక ఎంత హ్యాపీగా ఉందో చూసావా అని రాహుల్ చెప్పగా.. తను అలా ఎప్పుడు చేయదు. తనకి డబ్బు పిచ్చి లేదని స్వప్న చెప్తుంది. అయ్యో స్వప్న ఇంత అమాయకురాలివేంటి.. ఇదే నిజమని కావ్య గురించి చెడుగా చెప్తాడు రాహుల్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.