Read more!

English | Telugu

ఒక అమ్మాయిని ఇలా బలవంతపెట్టడం కరెక్ట్ కాదు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -113 లో.. ఒక గంట పర్మిషన్ కావాలని కృష్ణ, భవానిని అడుగుతుంది. గంట టైమ్ ఎందుకు ఇప్పుడే ఇంట్లో నుండి వెళ్ళిపో అని భవాని అనగానే... సర్ నాకు ఒక గంట పర్మిషన్ ఇప్పించగలరా అని మురారిని కృష్ణ అడుగుతుంది. పర్మిషన్ దేనికి అని మురారి అడుగగా.. గౌతమ్ సర్ ని కలిసి మాట్లాడాలని కృష్ణ అంటుంది. మురారి వద్దని చెప్తాడు. అయినా సరే వెళ్తానని కృష్ణ వెళ్తుండగా.. తన చెయ్యి పట్టుకొని ఆపుతాడు మురారి. కృష్ణతో మురారి అలా ప్రవర్తించడంతో ఇంట్లో అందరూ షాక్ అవుతారు.

మురారి తన చెయ్యి గట్టిగా పట్టుకోవడంతో.. వదలండి సర్ అని కృష్ణ చెప్పినా కూడా అతను వదలడు. దాంతో పక్కనే ఉన్న రేవతికి కోపమొస్తుంది. తను కోపంతో "ఏం చేస్తున్నావ్ రా. ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావ్? ఒక అమ్మాయిని ఇలా బలవంతపెట్టడం కరెక్ట్ కాదు.. వదులు మురారి" అని భవాని చెప్తుంది. అయిన కూడా మురారి పట్టించుకోడు. "వదులు మురారి.. గంటలో వస్తానని కృష్ణ చెప్తుంది కదా" అని ముకుంద అనగానే.. నువ్వు మా మధ్యలో కలుగజేసుకోకని మురారి అంటాడు. ఇక ఈశ్వర్ వచ్చి కృష్ణ చెయ్యిని విడిపించే ప్రయత్నం చేసినా మురారి వదలడు. కృష్ణ ఒక్కసారిగా వదలండి అని కోపంగా అరిచేసరికి.. మురారి చెయ్యి వదిలేస్తాడు. "నేను ఇన్ని రోజులు చూడని వ్యక్తి ఈ రోజు నాకు మీలో కన్పించారు. ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు మీరు నాకు ప్రతి దాంట్లో సపోర్ట్ గా ఉన్నారు. ఒక అబ్బాయితో మాట్లాడితే మీరు అందరు మగవాళ్లలాగా ఆలోచిస్తున్నారు. మీపై ఉన్న అభిమానమంతా ఎత్తుల్లో ఉండేది.. ఇప్పుడు ఒక్కసారిగా కిందకి పడిపోయింది. నేను ఈ ఇంటి నుండి శాశ్వతంగా వెళ్ళిపోతాను" అని కృష్ణ చెప్పేసి గౌతమ్ ని కలవడానికి వెళ్ళిపోతుంది. మురారి మాత్రం బాధపడుతూ సైలెంట్ గా ఉండిపోతాడు. 

గౌతమ్ దగ్గరికి వెళ్తుంది కృష్ణ. మీరు సీనియర్ డాక్టర్ అని మీకు రెస్పెక్ట్ ఇచ్చి మీరు చెప్పింది చేశానని చెప్పిన కృష్ణ.. గౌతమ్ చెంప పగులగొడుతుంది. తన ప్రేమ విషయం అంతా కృష్ణకి చెప్తాడు. ఇంట్లో వాళ్ళు కావాలనే నందుకి అలాంటి ట్రీట్ మెంట్ ఇస్తున్నట్లు గౌతమ్ చెప్తాడు. ఆ తర్వాత కృష్ణ మాటల్లో నందుకి ఇంకా పెళ్లి కాలేదనే విషయం తెలుసుకుంటాడు గౌతమ్. ఎలాగైనా సరే మీ ఇద్దరి పెళ్లి నేను చేస్తానని గౌతమ్ కి చెప్తుంది కృష్ణ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలాంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.