English | Telugu

Karthika Deepam2 : ఓ మరదిలిగా నీ మీద నాకెప్పుడు అభిమానం ఉంటుంది.. నిలదీసిన కాంచన!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'.. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -28 లో.... దీపని వెళ్ళలేదా.. ఎవడో వచ్చాడంటా అంటూ పారిజాతం ప్రశ్నించగా.. సుమిత్ర, శివనారాయాణ కలిసి తనకి గట్టిగా తిడతారు. ఇక అదే సమయంలో శౌర్యని ఎత్తుకొని రఘురాం వస్తాడు. అమ్మా.. తాతయ్య చూడు ఎన్ని చాక్లెట్లు ఇచ్చారోనని శౌర్య చెప్పగా.. ఇన్ని ఎందుకండి అని దీప అంటుంది. నా కూతురికి పెళ్లి అయి మనవరాలు పుడితే ఇలాగే ఆడుకుందాం అనుకున్నా కానీ నాకు ఆ దేవుడు కూతుర్ని, మనవరాలిని ఒకేసారి ఇచ్చాడు. తండ్రికి కూతురి మీద ఓ చనువు ఉంటుందమ్మ.. ఆ చనువుతోనే చెప్తున్నా నువ్వు ఎక్కడికి వెళ్లొద్దని రఘురాం అంటాడు. కొన్ని బంధాలు దగ్గర అయ్యే కొద్ది భారం అవుతాయండి అని దీప అనగానే.. కానీ కొన్ని బంధాలు దగ్గరైతే బాధ్యత అవుతాయి. సుమిత్ర నాకు అంతా చెప్పింది. ఈ చంటిదాన్ని ఇక్కడే స్కూల్‌లో చేర్పిస్తానని రఘురాం అంటాడు.

ఇక్కడ స్కూల్‌లో చదువులు అంటే లక్షల్లో ఉంటుందని పారిజాతం అనగానే.. నీ నెలవారి ఖర్చుల్లో సగం తగ్గిస్తే ఇలాంటి పిల్లలు నలుగురు చదువుకోవచ్చని శివనారాయాణ అంటాడు. దాంతో పారిజాతం మనసులోనే శివానారాయణని తిట్టేస్తుంది. ఇక అందరు కలిసి దీపని ఇంట్లో ఉండేలా ఒప్పిస్తారు. దాంతో పారిజాతం విసుక్కుంటుంది. మరోవైపు జ్యోత్స్న బర్త్ డే పార్టికి కార్తిక్ కూడా వెళ్తాడు. అక్కడ ఓ టేబుల్ మీద కార్తిక్ కూర్చొని మీటింగ్ కాల్ కోసం ఎదురుచూస్తుంటాడు. అంతలోనే గతంలో జ్యోత్స్నకి ప్రపోజ్ చేసిన గౌతమ్ వస్తాడు. మీ బావతో కలిసి డ్యాన్స్ చేయి.. మీ బావకి నువ్వంటే ఇష్టమని ఒప్పుకుంటానని జ్యోత్స్న కి గౌతమ్ ఛాలెంజ్ విసరుతాడు. దాంతో జ్యోత్స్న వెళ్ళి కార్తీక్ ను కలిసి డ్యాన్స్ చేద్దామని అడుగుతుంది. నాకు ఇలాంటివి ఇష్టం లేదని కార్తిక్ అంటాడు. బావ గౌతమ్‌కి నిన్ను అడిగే రైట్ లేదు కానీ నువ్వు చెప్పొచ్చు కదా. జ్యోత్స్న నాకు కాబోయే భార్య అని.. తనంటే నాకు చాలా చాలా ఇష్టమని చెప్పొచ్చు కదా.. ఇది గౌతమ్ అభిప్రాయమే కాదు నువ్వు అలా దూరంగా ఉంటే అందరు అలాగే అనుకుంటున్నారని జ్యోత్స్న అనగానే.. నువ్వు నేను ఏంటనేది మన పర్సనల్. ఇది నా వ్యక్తిగతం. అందరి ముందు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కాల్ వస్తే బయల్దేరుతా అని చెప్పా కదా బయల్దేరుతా.. ఓ మరదలిగా నీ మీద నాకు ఎప్పుడూ అభిమానం ఉంటుందని కార్తిక్ చెప్పేసి వెళ్ళిపోతాడు.

నువ్వేమో ప్రేమ అంటున్నావ్ మీ బావ అభిమానం అంటున్నాడు. సో ప్రేమ లేదన్నమాట. నీకు తప్ప మీ బావ దృష్టిలో నువ్వు ఏంటో అందరికీ తెలుస్తుంది. నీకు మీ బావ ప్రాణం మీ బావకి మాత్రం నువ్వు నత్తింగ్. అంటే.. నీలాంటి డైమండ్‌ని ఇలా వదిలేసి వెళ్లిపోవడం మాకు బాధగా ఉంది. నీకు లేదా అని జ్యోత్స్నతో గౌతమ్ అనగానే.. తను ఫుల్ తాగేస్తుంది. మరోవైపు రఘురాం మాటలనే గుర్తుచేసుకుంటుంది‌. మనం ఇక్కడే ఉంటున్నామని శౌర్యతో అనగానే.. మరి నాన్న ఎప్పుడు వస్తాడని అంటుంది. కార్తిక్ నాన్నని వెతకడానికి సాయం చేస్తానన్నాడని దీప చెప్తుంది. మరోవైపు శ్రీథర్ కాంచనకు పాలు తీసుకొని ఇస్తాడు. ఇంతలో కార్తీక్ ఇంటికి వస్తాడు. జ్యోత్స్నని వదిలేసి ఎలా వచ్చావని శ్రీథర్ ప్రశ్నిస్తాడు. జ్యోత్స్న పుట్టిన రోజు నాడు కూడా తనని వదిలేసి ఫోన్ కాల్ కోసం వచ్చావ్..కాల్‌కు ఉన్న ప్రాముఖ్యత నా కోడలికి లేదా అని కాంచన ప్రశ్నిస్తుంది. దీంతో కార్తీక్ వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.