English | Telugu

Karthika Deepam2 : యజమాని హోదాలో కూతురి దగ్గరికి వచ్చిన శివన్నారాయణ.. అక్కడేమో పారిజాతం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -400 లో.... శివన్నారాయణ జ్యోత్స్న కలిసి కాంచనని చూడడానికి వస్తారు. అప్పుడే కార్తీక్ దీప కూడా వస్తారు. శివన్నారాయణని నాన్న అని కాంచన పిలవబోతుంటే.. వద్దు ఆ పిలుపు అక్కడితోనే ఆపేయ్ అమ్మా.. ఇప్పుడు అయ్యగారు ఏ హోదాలో వచ్చారో తెలియదు కదా అని కార్తీక్ అనగానే ఏంట్రా ఆ మాటలు అని కాంచన అంటుంది.

నా దగ్గర పని చేసే డ్రైవర్ వాళ్ళ అమ్మకి బాలేకపోతే చూడడానికి వచ్చాను.. మీ యజమానిగా వచ్చానని శివన్నారాయణ అనగానే కాంచన బాధపడుతుంది. కార్తీక్, శివన్నారాయణల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. నాపై కోపం పోవాలని తాతని ఇక్కడికి బ్రతిమిలాడి తీసుకొని వచ్చానని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత శివన్నారాయణ మాటలకి కాంచన బాధపడుతుంది.

మరొకవైపు శ్రీధర్ ఇంటికి వస్తుంది పారిజాతం. నీ అల్లుడిని మా ఇంటికి పంపించి వాడు తిట్లు తినేలా చేసావని గొడవ పడుతుంది. మీ మనవడు ఏం చేసాడో తెలుసా అసలు ఎవరో ఫ్రెండ్ కి పది లక్షలు అప్పు ఇప్పించి మోసపోయాడు.. ఇప్పుడు వీడే ఆ డబ్బు కట్టాలని