English | Telugu

Karthika Deepam2 : భర్త కాలర్ పట్టుకున్న భార్య.. తప్పెవరిది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం 2 '. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -94 లో..... దీప కోసం కార్తిక్ వెతుకుతుండగా.. ఒక దగ్గర దీప కన్పిస్తుంది. దీపతో కార్తీక్ మాట్లాడాలని ట్రై చేస్తాడు. తనని తప్పుగా అర్ధం చేసుకుంటున్నావని అంటాడు. నేను శౌర్యని వాని నుండి కాపాడడం కోసం అలా చేసానని కార్తీక్ చెప్తాడు. మీరు అంతలా నా బిడ్డ గురించి ఆలోచించారు కదా మరి నా గురించి ఎందుకు ఆలోచించలేదని దీప అడుగుతుంది.

శౌర్య నా కూతురని మీరు చెప్పారు. ఆ నరసింహ దృష్టిలో నేను మీకు ఏమవుతాను.. అది ఆలోచించారా? నన్ను ఎలా చూస్తారని దీప ఎమోషనల్ అవుతుంది. ప్లీజ్ ఇంకోసారి మీరు మా జీవితంలోకి అడుగుపెట్టకండి. ఇప్పుడు నా వెనకాలే వచ్చి నేను ఉండే ఇల్లు తెలుసుకొని సుమిత్ర గారిని తీసుకొని రాకండి.. అలా చేస్తే ఊరు నుండే వెళ్లిపోతామని కార్తీక్ కి దీప చెప్పి వెళ్ళిపోతుంది. నువ్వు నన్ను అర్థం చేసుకుంటావ్ దీప.. నాకు తెలుసని కార్తీక్ అనుకుంటాడు. మరొకవైపు శౌర్య, దీపలున్న ఇంటివైపు చూస్తూ మనసు మార్చుకొని వస్తుందేమోనని తన ఇంటివైపే చూస్తున్నా కానీ దీప రాలేదని దశరత్ తో సుమిత్ర అంటుంది. నా సొంత కూతురు దూరంగా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుందని సుమిత్ర ఏడుస్తుంది. మరోకవైపు దీప ఇడ్లీలు అమ్మడానికి వెళ్తుంటే.. అమ్మ నేను కూడా వస్తాను.. లేదంటే లోపల నన్ను ఉంచి బయటవైపు గడియ పెట్టి వెళ్ళమని శౌర్య అంటుంది. ఎందుకని దీప అడుగుతుంది. కార్తీక్ నాకు గుర్తుకొస్తున్నాడు కదా.. ఒకవేళ వెళ్లిపోతానేమో అందుకేనని శౌర్యా అంటుంది. నువ్వు ప్రతిసారీ కార్తీక్ అని అనకు.. మర్చిపోమని శౌర్యతో దీప అంటుంది.

మరొకవైపు కార్తీక్ దగ్గరికి జ్యోత్స్న వస్తుంది. ఇండైరెక్ట్ గా నాకు నీ గురించి ఒక సీక్రెట్ తెలుసని అంటుంది కానీ చెప్పదు. జ్యోత్స్న ఇలా మాట్లాడుతుంది.. ఆ రోజు జరిగింది చూసిందా అని కార్తీక్ అనుకుంటాడు. మరొకవైపు దీప ఇడ్లీలు అమ్ముతుంటే నర్సింహా ఎదురుపడతాడు. దీప, కార్తీక్ ల గురించి తప్పుగా మాట్లాడుతుంటే.. నర్సింహ కాలర్ పట్టుకొని దీప వార్నింగ్ ఇస్తుంది. నిన్ను మాత్రం వదిలిపెట్టనని నరసింహ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.