English | Telugu

పొద్దుపొద్దున్నే ఫ్రంట్ అండ్ బ్యాక్‌తో కుర్రాళ్లకి పనిపెట్టేసిన దివి!


కొందరు ఏం చేసైనా ట్రెండింగ్ లో ఉంటారనుకుంటారు. అందుకే అందాల ఆరబోస్తూ వైరల్ అవ్వాలని వారానికోసారి సోషల్ మీడియాలోని నెటిజన్లకి అందాలతో గాలాలు వేస్తుంటారు. ఇక ఆ హాట్ అండ్ బోల్డ్ ఫోటోలు చూసిన కొందరు నెగెటివ్ కామెంట్లు చేస్తుంటారు. అలా రెగ్యులర్ గా ట్రిప్ లు అంటు ఫోటో షూట్ లలో బిజీగా ఉండేవాళ్ళలో దివి ఒకరు.

దివి వాద్య.. ఈ పేరు ఇప్పుడు అందరికి సుపరిచితమే. బిగ్ బాస్ 4 లో ఛాన్స్ కొట్టేసి మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ భామకి మంచి క్రేజ్ ఉంది. అంతే కాకుండా వరుస ఆఫర్స్ తో బిజీగా ఉంటుంది. ఈమె ఇండస్ట్రీకి మొదటగా ఒక మోడల్ గా పరిచయం అయింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో వెండి తెర పై మెరుపు తీగలా అలా వచ్చి ఇలా వెళ్తుంది. ఆ తర్వాత బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఈ అమ్మడుకి క్రేజ్ వేరే లెవెల్ లో వచ్చేసింది. ఏటీఎమ్ వెబ్ సిరీస్ లో కూడా నటించింది.

దివికి ఇన్ స్టాగ్రామ్ లో 1.2 మిలయన్ ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా పాండిచ్చేరి వెళ్ళిన దివి తన ఇన్ స్టా అకౌంట్ లో మార్నింగ్ 'సమ్ యాక్షన్స్ ఇన్ ది మార్నింగ్' అంటు పింక్ కలర్ ప్యాంట్, డార్క్ బ్లూ బ్లౌజ్ తో దిగిన కొన్ని ఫోటోలని షేర్ చేసింది. దివి అప్లోడ్ చేసిన పద్నాలుగు గంటల్లోనే నలభై ఏడువేల మంది లైక్ చేయగా, వన్‌ మిలియన్ పైగా వ్యూస్ ని ఈ పోస్ట్ సొంతం చేసుకుంది. ఓ ఫోటోలో ఒకటి ఫ్రంట్ చూపిస్తూ దిగింది. మరొక ఫోటోలో బ్యాక్ చూపిస్తూ.. మొత్తంగా మూడు ఫోటోలతో ఇన్ స్టాగ్రామ్ లోని ఫాలోవర్స్ అందరిని తన వైపు చూసేలా చేసింది ఈ బ్యూటీ. దాంతో ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ గా మారాయి. మరి మీరు కూడా చూసేయ్యండి.


Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.