English | Telugu

Karthika Deepam2 :  కార్తీక్ , దీపలని కలపడానికి ఆ ఇద్దరు..  శౌర్య ప్రేమ కీలకం కానుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -184 లో.. కార్తీక్ ని శౌర్య చాటుగా చూస్తూ.. నాన్న అని పిలుస్తుంది. దానికి కార్తీక్ రియాక్ట్ అవ్వడు. దాంతో శౌర్య తన దగ్గరికి వచ్చి కార్తీక్ నిన్ను నాన్న అని పిలవచ్చా.. నాకు పిలవాలని ఉందని శౌర్య అంగగానే.. సరే అంటాడు కార్తీక్. నాన్న అని శౌర్య పిలవడంతో దగ్గరికి తీసుకొని కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. అదంతా దూరం నుండి కాంచన, అనసూయ ఇద్దరు చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అక్కడ తల్లిని మనం కదిలించం.. ఇక్కడ నాన్నని కూతురు కదిలించింది. కదిలించడం కాదు అనసూయ.. కలపాలని కాంచన అంటుంది.

ఆ తర్వాత అమ్మనాన్నలు దూరంగా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావా ఉంటూ.. అనసూయ కాంచన ఇద్దరు కలిసి శౌర్యలో ఒక ఆలోచన క్రియేట్ చేస్తారు. నాకు అర్థమైందంటు కార్తీక్ ని శౌర్య తీసుకొని వచ్చి హాల్లో కూర్చోపెడుతుంది. ఆ తర్వాత దీప కూరగాయలు కట్ చేస్తుంటే పాలు పొంగుతాయి. అప్పుడే శౌర్య వచ్చి దీపని తీసుకొని వెళ్లి.. కార్తీక్ పక్కన కూర్చోపెడుతుంది వాళ్ళ మధ్యలో శౌర్య నిల్చొని కాంచనని ఫోటో తీయమంటుంది. దీప చిరాకుగా ఉంటుంది. అప్పుడే దాస్, కాశీ, స్వప్నలు వచ్చి కంగ్రాట్స్ చెప్పి స్వీట్ ఇస్తారు. నాకు పని ఉందంటూ దీప లోపలికి వెళ్తుంటే.. అమ్మ ఇప్పుడే తినాలని శౌర్య తీసుకొని వెళ్లి దీపకి ఇస్తుంది.

ఆ తర్వాత దాస్ కి ఫోన్ వస్తే పక్కకి వెళ్లి మాట్లాడతాడు. అప్పుడే బాల్ కన్పించడం లేదని శౌర్య వెతుకుతుంటే దాస్ వస్తాడు. బాల్ ఎక్కడ ఉంది తాతయ్య అని శౌర్య అంటుంది. బాల్ శౌర్య తీసుకుంటుండగా బ్యాగ్ నుండి కుబేర్ ఫోటో కిందపడిపోతుంది. అది తీసి చూస్తుండగా అప్పుడే అనసూయ వచ్చి.. దాస్ చేతిలో నుండి తీసుకుంటుంది. దాంతో దాస్ ఫోటో చూడడు. మరొకవైపు జ్యోత్స్న దగ్గరికి దశరథ్, సుమిత్ర ఇద్దరు వస్తారు. వేరే పెళ్లి గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటే.. నాకు ఆల్రెడీ బావతో పెళ్లి అయిందంటూ జ్యోత్స్న ఆర్గుమెంట్స్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.