English | Telugu

Eto Vellipoyindhi Manasu : గులాబ్ జామ్ తిని కడుపు నొప్పి తెచ్చుకున్న సిరి.. నందిని హ్యాపీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -235 లో... సీతాకాంత్ కి ఇష్టమైన గులాబ్ జామ్ చేస్తుంది రామలక్ష్మి. అదంతా అభి కిటికీలో నుండి చూస్తూ.. సీతాకాంత్ పై ఇంత ప్రేమ చూపిస్తున్నావేంటి రామలక్ష్మి అని అనుకుంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి ఫోన్ మాట్లాడుతుంటే అభి చాటుగా వెళ్లి.. ఆ స్వీట్ లో ఏదో కలుపుతాడు. ఆ తర్వాత సీతాకాంత్ ఆఫీస్ కి వెళ్ళాలని బట్టలు ఇవ్వమని అడుగుతాడు. అన్ని పనులు ముందే చేసాను కదా ఇప్పుడు ఎందుకు ఆఫీస్ అని రామలక్ష్మి అంటుంది. ఇప్పుడు ఆఫీస్ నెంబర్ వన్ గా ఉండాలంటే ఇలా సెలవు తీసుకొని ఉండకూడదని సీతాకాంత్ అనగానే.. మీ మాటల్లో మీ కంపెనీతో ఎవరు పోటీ పడలేరని డ్రెస్ ఇస్తుంది. సీతాకాంత్ ఆఫీస్ కి వెళ్ళడానికి తనే స్వయంగా రెడీ చేస్తుంది.

ఆ తర్వాత సీతాకాంత్ కి సిరికి స్వీట్ ఇస్తుంది. సీతాకాంత్ కి ఇవ్వబోతుంటే అది కిందపడిపోతుంది. ఇక సీతాకాంత్ అది తినకుండానే ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత స్వీట్ సిరి తింటుంది. సీతాకాంత్ కి ఏం కాకపోవచ్చు కానీ వాళ్లు విడిపోవడం మాత్రం ఖాయమని అభి అనుకుంటాడు. ఆ తర్వాత నందిని రాత్రి.. సీతాకాంత్, రామలక్ష్మి లు ఒకటి అయ్యారేమోనని టెన్షన్ పడుతుంది. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. రాత్రి అంత నీరసంగా ఉన్నావ్.. వద్దన్నా వెళ్ళావని నందిని అడుగుతుంది. వెళ్ళాను కానీ రాత్రి బాగా నిద్రపట్టింది తెల్లవారి లేచేసరికి ఎక్కడ ఉన్నాను ఏం జరిగిందో ఏం గుర్తు లేదని సీతాకాంత్ అనగానే.. హమ్మయ్య వాళ్ళ మధ్య ఏం జరగలేదని నందిని రిలాక్స్ అవుతుంది.

ఆ తర్వాత శ్రీవల్లీని శ్రీలత పిలిచి.. నిన్న నేను ప్లాన్ చెయ్యట్లేదు అన్నావ్ కదా రామలక్ష్మి, సీతాకాంత్ ని పుట్టింటికి తీసుకొని వెళ్లినా కూడా అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఏం జరగలేదంట అని శ్రీవల్లితో శ్రీలత చెప్పగానే.. తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత సిరికి కడుపు నొప్పి వస్తుంది‌. దాంతో రామలక్ష్మి హాస్పిటల్ కి తీసుకొని వెళ్తు.. సీతాకాంత్ కి ఫోన్ చేసి చెప్తుంది. ఆ తర్వాత శ్రీలత వాళ్ళందరు హాస్పిటల్ కి వస్తారు. సిరికి ఏం కాదని రామలక్ష్మి అంటుంటే.. మీరంతా అనుకొని చేసిన పనే ఇది అని రామలక్ష్మిని శ్రీలత తిడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.