English | Telugu

Karthika Deepam 2: కన్నతల్లి కోసం దీప కడుపులోని బిడ్డని‌ వదులుకుంటుందా?

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -583 లో.. కార్తీక్, దీప ఇద్దరు మాట్లాడుకుంటారు. మావయ్యకి జ్యోత్స్న ప్రవర్తన గురించి అనుమానం వచ్చింది. రేపు మళ్ళీ బ్లడ్ శాంపిల్స్ కి తీసుకొని వెళ్తున్నాడని కార్తీక్ చెప్తాడు. వెళ్లి కూడా మళ్ళీ ఇదే సిచువేషన్ కదా అని దీప అంటుంది. ఇప్పుడు మావయ్యకి ఎందుకు మ్యాచ్ అవ్వడం లేదో తెలిసిపోతుందని కార్తీక్ అంటాడు. అలా తెలిస్తే ఎలా అని దీప అనగానే.. మనకి సులువు అవుతుందని కార్తీక్ అంటాడు.

మరొకవైపు జ్యోత్స్నకి టెన్షన్ పెరిగిపోతుంది. రౌడీ కి ఫోన్ చేసి దాస్ కి ఫోన్ ఇవ్వమని చెప్తుంది జ్యోత్స్న. కూతురు కోసం నువ్వు మారిపో నాన్న.. నువ్వు ఒక్కడివి మారిపోతే మనం బాగుంటామని జ్యోత్స్న రిక్వెస్ట్ చేస్తుంది. నువ్వు మారిపోమని దాస్ అంటాడు. దాంతో జ్యోత్స్న కోపంగా ఫోన్ కట్ చేస్తుంది.

మరొకవైపు దీప, కార్తీక్ రోడ్డు పక్కన వినాయకుడి దగ్గర ఇద్దరు మొక్కుకుంటారు. కాసేపు కూర్చొని మాట్లాడుకుంటారు. అప్పుడే డాక్టర్ ఫోన్ చేసి రిపోర్ట్స్ వచ్చాయని చెప్పి రమ్మంటుంది. ఇద్దరు హాస్పిటల్ కి బయల్దేరతారు.

మరొకవైపు దేవుడికి పూజ చేసి ఇంట్లో దూపం వేస్తుంది పారిజాతం. అది చూసి శివన్నారాయణ ఏంటి ఇదంతా అని అడుగుతాడు. అంటే ఇంట్లో బాలేదు కదా అని పారిజాతం అంటుంది. దశరథ్ వచ్చి జ్యోత్స్నకి మళ్ళీ శాంపిల్స్ అని చెప్తే ఒప్పుకోదు.. చెప్పకుండా తీసుకొని వెళ్లాలని దశరథ్, శివన్నారాయణ అనుకుంటారు. ఈ విషయం జ్యోత్స్నకి నువ్వు చెప్పొద్దని పారిజాతంతో శివన్నారాయణ చెప్తాడు. జ్యోత్స్నని పిలిచి బయటకు వెళ్ళాలని తీసుకొని వెళ్తారు. పారిజాతం సైగ చెయ్యాలని ట్రై చేస్తుంది కానీ కుదరదు.

మరొకవైపు దీప శాంపిల్స్ మ్యాచ్ అవుతాయి. అదేంటీ దీప..సుమిత్ర కూతురా అని డాక్టర్ షాక్ అవుతుంది. అవును ఈ విషయం మాకు మాత్రమే తెలుసని కార్తీక్ అంటాడు. మ్యాచ్ అయినా సరే సుమిత్రని నువ్వు కాపాడలేవు.. ఇప్పుడు నువు ప్రెగ్నెంట్ నీ బాడీ అంత పర్ ఫెక్ట్ గా లేదు.. మీ అమ్మ ప్రాణాలు కాపాడాలంటే నీ బిడ్డని త్యాగం చేయాలి. అలా ఒక ప్రాణం తీసి ఇంకొక ప్రాణం నిలబెట్టలేనని డాక్టర్ అనగానే కార్తీక్, దీప షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.