English | Telugu

Karthika Deepam2 :  తన మరదలికి కార్తిక్ అసలు నిజం చెప్పగలడా.. దీప పయనం ఎటువైపు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -8 లో.. కార్తీక్ చాలా రోజుల తర్వాత ఇంటికి వస్తాడు. తనని చూసిన తన తల్లి కాంచన చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు ముందు వెళ్లి జ్యోత్స్న ని కలువు..తను వేయికళ్ళతో ఎదురుచూస్తుందని కాంచన అంటుంది. ఆ తర్వాత తన అత్తయ్య, మావయ్యలని కార్తిక్ కలుస్తాడు. వాళ్ళు కూడా ముందు వెళ్లి జ్యోత్స్న ని కలువు.. తను వెయ్యికళ్ళతో ఎదురు చూస్తుందని అంటారు.

ఆ తర్వాత పారిజాతం ఎదురుపడుతుంది. నువ్వు ముందు వెళ్లి జ్యోత్స్నని కలువని అనగానే.. అసలు నేను జ్యోత్స్న ని కేవలం మరదలిగానే చూస్తునాననే విషయం ఎలా చెప్పాలని కార్తీక్ అనుకుంటాడు. ఆ తర్వాత కార్తీక్ వెళ్లేసరికి జ్యోత్స్న ఫోన్ లో కార్తీక్ ఫోటో చూస్తూ మురిసిపోతుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. తనని చూసిన హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిన్న నైట్ పార్టీ లో మా ఫ్రెండ్ ప్రపోజ్ చేసాడు కానీ మా బావని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని చెప్పాను బావ అని జ్యోత్స్న అనగానే.. నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదని కార్తీక్ చెప్పబోతుంటే.. ఎవరో పిలిస్తారు. మరొకవైపు దీప తన కూతురు శౌర్యని తీసుకొని హైదరాబాద్ రావడానికి వెహికల్ కోసం చూస్తుంటుంది. చాలా సేపటికి కార్ రావడంతో అందులో హైదరాబాద్ బయలుదేర్తారు. మరోవైపు కార్తీక్ తన చిన్నతనంలో దీప కాపాడినప్పుడు తన మెడలోని చైన్ పోగోట్టోవడం, అది కార్తీక్ దగ్గరే ఉండటంతో.. దాన్నే చూస్తుంటాడు. ఆ రోజు నువ్వు నా ప్రాణాలు కాపాడావ్.. నా ముందు రెండు కోరికలు ఉన్నవి. ఒకటి నా ప్రాణాలు కాపాడిన దీపని కలవడం, మరొకటి నేను తప్పు చేసిన వాళ్ళని క్షమించమని అడగడమని కార్తీక్ అనుకుంటాడు.

ఆ తర్వాత కార్తీక్ , జ్యోత్స్న ఇద్దరు బయటకు వెళ్తుంటే పారిజాతం చూసి.. మీరు ఎంత చక్కగా ఉన్నారో అని అంటుంది. ఫోన్ కోసమని జ్యోత్స్న వెళ్తుంది. అసలు జ్యోత్స్న పై ఏ ఫీలింగ్ లేదు. ఆ విషయం చెప్పడానికి ఇప్పుడు బయటకు తీసుకొని వెళ్తున్నానని పారిజాతంతో కార్తీక్ అనగానే.. నువ్వు అలా చెప్తే అది తట్టుకోలేదు. నేను చెప్తాను.. నువ్వు చెప్పకని పారిజాతం అంటుంది. నేను ఇంత బిడ్డని మార్చింది వేస్ట్ కాకూడదు. ఈ ఆస్తులన్నింటికి వారసురాలు.. నా మనవరాలు కావాలి. కార్తీక్ పెళ్లి చేసుకునేలా చెయ్యాలని పారిజాతం అనుకుంటుంది. మరొకవైపు దీప శౌర్యలు హైదరాబాద్ కి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2: వైరాతో జ్యోత్స్న డీలింగ్.. కార్తీక్ కి డౌట్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -544 లో.....శౌర్యకి దీప భోజనం తినిపిస్తుంది. అది చూసి కొడుకు కోడలితో చెల్లి మాట్లాడుతలేనట్లు ఉందని అనసూయ అంటుంది. వాళ్లే దాక్కొని తిరుగుతున్నారని కాంచన అంటుంది. శౌర్య వెంట భోజనం తినమని దీప పరుగెడుతుంది. శౌర్య అలా అమ్మని పరిగెత్తించవచ్చా.. ఇప్పుడు అమ్మ కడుపులో బేబీ ఉంది కదా తనకి ఆయాసం వస్తుంది ఇకనుండి నువ్వే భోజనం చెయ్యాలని కాంచన అనగానే.. నువ్వు మంచి నానమ్మవి కాదు నిన్ను తాతయ్య దగ్గరికి పంపించాలి.. మా అమ్మ నాకు తినిపించకుండా చేస్తున్నావని శౌర్య అంటుంది.

Illu illalu pillalu: ఇంగ్లీష్ టీచర్ గా శ్రీవల్లి.. ప్రేమ, నర్మద ప్లాన్ సూపర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో... భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు ఇంటికి శ్రీవల్లి డూప్లికేట్ సర్టిఫికేట్లు తీసుకొని వస్తారు. అవి ప్రేమ చూసి డూప్లికేట్ సర్టిఫికేట్లు అని చెప్పదు. ఇంకేంటి మావయ్య మీరు మీకు తెలిసిన కాలేజీ ప్రిన్సిపల్ కి ఫోన్ చెయ్యండి.. అక్క  ఇంగ్లీష్ టీచర్ గా జాయిన్ చెయ్యండి అని ప్రేమ అంటుంది. రామరాజు ఫోన్ చేస్తుంటే కావాలనే శ్రీవల్లి తుమ్ముతుంది. ఇప్పుడే వద్దు మావయ్య అంటుంది. అయినా రామరాజు వినకుండా ఫోన్ చేసి ప్రిన్సిపల్ తో మాట్లాడతాడు.