English | Telugu

బిగ్ బాస్ ప్రియాంక-శివ్ కుమార్‌ ల పెళ్ళి.. హేళన చేయోద్దంటూ నెటిజన్లు ఫైర్!

పెళ్ళి అంటే వేదమంత్రాల సాక్షిగా ఇరు కుటుంబాలు, బంధుమిత్రుల సమక్షంలో అంగరంగవైభవంగా జరుగుతుంది. దేవాదిదేవుళ్ళే భువిపైకొచ్చి పెళ్ళికొడుకు పెళ్ళికూతురిని ఆశీర్వదిస్తారని మన నమ్మకం. మరి అలాంటి మన నమ్మకాలని, సంప్రదాయాలని హేళన చేస్తూ మరో కొత్త నాటకం మొదలెట్టారు బిగ్ బాస్ ప్రియాంక- శివ్ కుమార్.

జానకి కలగనలేదు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి దగ్గర అయింది ప్రియాంక. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో మొదటి కంటెస్టెంట్ గా అడుగుపెట్టి తన ఆటతీరుతో, మాటతీరుతో ఎంతో ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. హౌస్ లో ఉన్నప్పుడు సీరియల్ బ్యాచ్ గా పేరుతెచ్చుకున్న అమర్, శోభాశెట్టి, ప్రియాంక.. ఎప్పుడు కలిసి ఉండేవారు. గేమ్ అయిన బయట అయిన గ్రూపిజం చేస్తు ఉండటంతో ప్రేక్షకులలో వీరిపట్ల నెగెటివిటి పెరిగిపోయింది. దాంతో శోభాశెట్టిని గ్రాంఢ్ ఫినాలే ముందు వారంలో బయటకు పంపించారు. ఇక టాప్-5 లో ఒకరిగా ఉన్న ప్రియాంక జైన్.‌ అయిదవ కంటెస్టెంట్ గా ఎలిమినేషన్ అయి బయటకొచ్చింది. ఆ తర్వాత తన యూట్యూబ్ ఛానెల్ లో వ్లాగ్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది. కొన్ని రోజుల క్రితం అమ్మకి క్యాన్సర్ అంటు సింపతీ డ్రామా వాడి వ్లాగ్ కి వ్యూస్ తెచ్చుకొని సొమ్ము చేసుకుంది.‌ ఇప్పుడేమో ఏకంగా పెళ్ళి చేసుకున్నామంటూ మరో వ్లాగ్ చేసి తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది ప్రియాంక. అయితే గత కొన్నేళ్లుగా శివ్ కుమార్, ప్రియాంక జైన్ సహజీవనం చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.

వీళ్ల పెళ్లికి సంబంధించి వీడియోలు.. పెట్టడం జనాల్ని మిస్ లీడ్ చేయడం వీళ్లకి ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు చాలాసార్లు అదిగో పెళ్లి ఇదిగో పెళ్లి అంటూ వీడియోలు పెట్టి మిలియన్ల వ్యూస్‌ని రాబట్టారు. ఇప్పుడు మళ్లీ.. ‘మీకు చెప్పకుండా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది’ అంటూ పెళ్లి పేరుతో ఓ వ్లాగ్ ని తమ యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేశారు. అయితే ట్విస్ట్ ఏంటంటే.. స్టార్ మాలో ఉగాది ప్రోమో వచ్చిన తర్వాత వీళ్ల యూట్యూబ్‌లో ఆ వీడియోని అప్లోడ్ చేసి అడ్డంగా దొరికిపోయారు. పెళ్లి అయిపోయిందని ముందే వీడియో పెట్టి ఉంటే.. కాస్తో కూస్తో నమ్మేవారు. కానీ.. స్టార్ మా‌లో ఉగాది ప్రోమోలో వీళ్ల పెళ్లి యవ్వారం ముందే చూసేయడంతో.. అయ్యిందిలే పెళ్లి.. స్టార్ మా ఛానల్‌లో ఉగాది ప్రోమో చూశాంలే కానీ.. మీ డ్రామాలు ఆపండి అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కాగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మరి మీలో ఎంతమంది వీరి పెళ్ళి డ్రామాని చూశారు.

Karthika Deepam2: వైరాతో జ్యోత్స్న డీలింగ్.. కార్తీక్ కి డౌట్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -544 లో.....శౌర్యకి దీప భోజనం తినిపిస్తుంది. అది చూసి కొడుకు కోడలితో చెల్లి మాట్లాడుతలేనట్లు ఉందని అనసూయ అంటుంది. వాళ్లే దాక్కొని తిరుగుతున్నారని కాంచన అంటుంది. శౌర్య వెంట భోజనం తినమని దీప పరుగెడుతుంది. శౌర్య అలా అమ్మని పరిగెత్తించవచ్చా.. ఇప్పుడు అమ్మ కడుపులో బేబీ ఉంది కదా తనకి ఆయాసం వస్తుంది ఇకనుండి నువ్వే భోజనం చెయ్యాలని కాంచన అనగానే.. నువ్వు మంచి నానమ్మవి కాదు నిన్ను తాతయ్య దగ్గరికి పంపించాలి.. మా అమ్మ నాకు తినిపించకుండా చేస్తున్నావని శౌర్య అంటుంది.

Illu illalu pillalu: ఇంగ్లీష్ టీచర్ గా శ్రీవల్లి.. ప్రేమ, నర్మద ప్లాన్ సూపర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో... భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు ఇంటికి శ్రీవల్లి డూప్లికేట్ సర్టిఫికేట్లు తీసుకొని వస్తారు. అవి ప్రేమ చూసి డూప్లికేట్ సర్టిఫికేట్లు అని చెప్పదు. ఇంకేంటి మావయ్య మీరు మీకు తెలిసిన కాలేజీ ప్రిన్సిపల్ కి ఫోన్ చెయ్యండి.. అక్క  ఇంగ్లీష్ టీచర్ గా జాయిన్ చెయ్యండి అని ప్రేమ అంటుంది. రామరాజు ఫోన్ చేస్తుంటే కావాలనే శ్రీవల్లి తుమ్ముతుంది. ఇప్పుడే వద్దు మావయ్య అంటుంది. అయినా రామరాజు వినకుండా ఫోన్ చేసి ప్రిన్సిపల్ తో మాట్లాడతాడు.