English | Telugu
అర్థరాత్రి పాప కోసం వచ్చిన బూచోడు.. ఆ ఎంగేజ్ మెంట్ జరిగేనా!
Updated : Jul 20, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -101 లో.... కార్తీక్ ని కలిసానని శౌర్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కార్తీక్ వెళ్ళిపోయాక శౌర్య లోపలికి వచ్చి.. గోడపై ఉన్న కార్తీక్ అనే పేరుని తుడిపేస్తుంది. ఎందుకు అలా చేస్తున్నావని దీప అడుగుతుంది. కార్తీక్ వచ్చాడు కదా అమ్మ.. ఇకనుండి రోజు వస్తాడు. అందుకే అని శౌర్య చెప్తుంది.
మరొకవైపు దీపని కార్తిక్ కలిసాడని పారిజాతానికి జ్యోత్స్న చెప్తుంది. బావకి దీప ఎక్కడ ఉందో తెలుసు.. అయిన చెప్పట్లేదు. మొన్న అమ్మ అడిగినా కూడా చెప్పడం లేదు. ఇక్కడున్నా బావకి, కడియం బాబాయ్ ఫోన్ చెయ్యగానే హడావిడిగా వెళ్లిపోయాడు.. తీరా చూస్తే శౌర్య దగ్గరికి వెళ్ళి అక్కడి నుండి దీప దగ్గరకి వెళ్ళాడు. అక్కడ చాలాసేపు దీప, బావ కలిసి మాట్లాడుకున్నారు. అదేంటో వినలేదని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. డౌట్ లేదు మీ ఎంగేజ్ మెంట్ జరగదని పారిజాతం అనగానే.. తప్పకుండా జరుగుతుంది. ముందు దీపని ఇక్కడికి తీసుకొని రావాలని జ్యోత్స్న అనుకుంటుంది. నువ్వు ఇలాగే ఉండు మనవరాల.. కార్తీక్ తో నీ ఎంగేజ్ మెంట్ ఎలా జరగదో నేను చూస్తానని పారిజాతం అనుకుంటుంది.
మరొకవైపు దీప శౌర్యని పడుకోపెడుతుంది. అర్ధరాత్రి ఎవరో డోర్ కొడుతుంటే దీపకి భయమేస్తుంది. ముందు జాగ్రత్తగా చేతిలో కర్రని పట్టుకొని డోర్ తీస్తుంది.. తీరా చూస్తే నరసింహ వస్తాడు. నా కూతురిని తీసుకొని వెళదామని వచ్చానని నరసింహా అంటాడు. శౌర్య నా కూతురు అని నాకు తెలుసు కానీ తల్లి నువ్వు కాదు అని నరసింహా అంటాడు.ఆ తర్వాత శౌర్యని తీసుకొని వెళ్తా అని నర్సింహా వెళ్తుంటే.. దీప అడ్డుపడుతుంది. అప్పుడే శౌర్య లేచి అమ్మ డోర్ తియ్ అంటుంది. ఎక్కడ నరసింహని చూస్తే శౌర్య భయపడుతుందోనని దీప అనుకుంటుంది. ఆ లోపే చుట్టుపక్కన వాళ్ళు వచ్చి నరసింహాపై కోప్పడి పంపించేస్తారు.
ఆ తర్వాత డోర్ తీసి శౌర్యని దగ్గరికి తీసుకుంటుంది దీప. అమ్మ బూచోడు వచ్చాడా అని శౌర్య అనగానే.. లేదని దీప చెప్తుంది. అందుకే నాన్న దగ్గరకి వెళదామని అన్నాను.. నాన్నని వెతకడానికి కార్తీక్ హెల్ప్ తీసుకుందామా అని శౌర్య అంటుంది. శౌర్యా ఆ రోజు కార్తీక్ బాబు మాటలు వినలేదన్నమాట అని దీప హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత కార్తీక్ బాబు అన్నది కరెక్టే ఎక్కడున్న ఆ నరసింహా వస్తాడు. సుమిత్ర గారి దగ్గర అయితే మా జోలికి రాడని దీప అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.