English | Telugu

ఇనయాలో ఈ యాంగిల్ కూడా ఉందా..!

ఇనయా సుల్తానా (Inaya Sultana) గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నాణేనికి రెండో వైపు మంచితనం అనేది ఉంటుంది అని ఇనయా నిరూపించి చూపించింది. ఇదంతా ఎందుకు అంటే ఆమె తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ పెట్టింది. అది చూసేసరికి అందరూ షాక్ అయ్యారు. "నేను నిన్నపెట్టిన స్టోరీ చూసి చాలామంది అడుగుతున్నారు.. ఏమయ్యింది అని.. మేము సేఫ్ గా ఉన్నాం. మేము వచ్చేటప్పుడు దారిలో ఒక ఆక్సిడెంట్ జరిగింది. అది చూసి మేము చాలా పానిక్ ఐపోయాం. గౌతమ్ కి మెడికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టి వెంటనే రంగంలోకి దిగి ఆ పేషెంట్ ని కాపాడాడు. కానీ అతని పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. మేము వాళ్ళ వాళ్ళతో ఇప్పటికీ టచ్ లోనే ఉన్నాం. మేము తన కోసం ప్రే చేస్తాం. మీరు కూడా అతని కోసం ప్రే చేయండి " అని చెప్పింది.

తర్వాత ఆమె స్నేహితుడు గౌతమ్ మాట్లాడుతూ "అతనికి చాలా రక్తం పోయింది. వెంటనే మా మదర్ చున్నీతో బ్లడ్ ఆగేలా చేసి అతనితో గ్యాప్ లేకుండా స్పృహ కోల్పోకుండా మాట్లాడుతూ ఫోన్ పాస్వర్డ్ తెలుసుకుని వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి ఇలా రోడ్ ఆక్సిడెంట్ గురించి వాళ్లకు ఇన్ఫార్మ్ చేసాం. ఇక ఇనాయ చాల మంచి పని చేసింది. అక్కడి ట్రాఫిక్ ని క్లియర్ చేసింది. వెంటనే అంబులెన్సు కి ఫోన్ చేసి పిలిపించింది. కానీ రావడానికి అరగంట పట్టింది అంబులెన్సు. ఇది వర్షా కాలం ఫ్రెండ్స్. రోడ్లు జారిపోతూ ఉంటాయి కాబట్టి బైక్స్ నడిపే వాళ్ళు చాలా జాగ్రత్తగా నడపాలి. మన జీవితం చాలా ముఖ్యం కాబట్టి.. చాలా కాన్సంట్రేషన్ గా ఉండాలి బండి మీద వెళ్ళేటప్పుడు. మన తప్పు లేకపోయినా బండి స్కిడ్ అయ్యి పడిపోతాం..స్లోగ వెళ్తే ఏమీ కాదు. ప్లీజ్ టెక్ కేర్ " అని చెప్పాడు.

ఇక నెటిజన్స్ ఐతే నిన్నమొన్నటి వరకు ఇనయాని - గౌతమ్ ని తిట్టినా వాళ్లంతా ఇప్పుడు పొగిడేస్తున్నారు. "మంచి పని చేసారంటూ అభినందిస్తున్నారు. నీ ఫేస్ చూసి ఏదో అనుకున్నాం బ్రో..కానీ నీ మనసు చాలా మంచిది." అంటున్నారు.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.