English | Telugu
జ్వాల లెక్కలు తేల్చుకోవడం మొదలు పెట్టిందా?
Updated : Jun 28, 2022
కార్తీక దీపం 1389వ ఎపిసోడ్ హైలైట్స్.. మంగళవారం ఎపిసోడ్ తో ఏం జరగనుందో ఇప్పుడు చూద్దాం. హిమ పై కోపంలో రక్తంతో గీసిన బొమ్మని ముక్కలు ముక్కలుగా చించిపడేస్తుంది జ్వాల. ఆ ముక్కలని అతికించి సౌందర్య.. జ్వాలకు ఇస్తుంది. నా కోపం డాక్టర్ సాబ్ మీద కాదు ఆ తింగరి మీద.. ఎంత చేశాను తనకి..ఎలా వుండేదో తెలుసా? ప్రతి దానికి భయమే.. ఎంత అమాయకంగా వుండేదో తెలుసా? కానీ ఇప్పుడు నన్ను మోసం చేసేంతగా మారిపోయింది. నా జీవితాన్ని నా డాక్టర్ సాబ్ ని నా నుంచి దూరం చేసింది..క్షమించను.. వదిలేదే లేదు.. అంటూ జ్వాల రగిలిపోయింది.
కట్ చేస్తే.. శోభ చేస్తున్న పనికి ఆగ్రహంతో ఊగిపోయిన హిమ లాగిపెట్టి కోట్టి వార్నింగ్ ఇస్తుంది. అయితే అది నిజం కాదు.. అలా కొట్టాలని హిమ ఊహించుకుంటుంది. నిద్రలోంచి ఉలిక్కిపడి లేచి నా ప్లాన్స్ నాకే రివర్స్ అయ్యేలా వున్నాయి అనుకుంటుంది. ఇక నిరుపమ్ , స్వప్నలు పెళ్లి శుభలేఖ హిమ వాళ్లకి ఇచ్చి ఇంటికి వచ్చేసరికి జ్వాల ఆటో ఇంటి ముందు వుంటుంది. నిరుపమ్, స్వప్న షాక్ అవుతూ కారు దిగుతారు. జ్వాల కళ్లనిండా నీళ్లతో నిరుపమ్ నే చూస్తూ వుండగా.. స్వప్న `ఏంటే ఏకంగా ఆటోని తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టావ్ అంటుంది. నిరుపమ్ మాత్రం `ఏంటి జ్వాల ఇలా వచ్చావ్ అంటాడు.
ఇంతలో స్వప్న .. మెత్తగా అడుగుతావేంటీ.. గట్టిగా మాట్లాడరా.. వెళ్లమని చెప్పు.. అని రగిలిపోతుంది. హలో మేడమ్ మీతో వెళ్లమని చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. కొన్ని లెక్కలు తేల్చుకోవాలని వచ్చా` అంటుంది జ్వాల. వెంటనే స్వప్న జ్వాల పైకి చేయి లేపుతుంది.. చెంప పగలగొట్టాలని ప్రయత్నిస్తుంది. ఇంతలో నిరుపమ్ `మమ్మీ ఏంటిది` అంటూ వారిస్తాడు.. మీరు చేసిన సహాయానికి థ్యాంక్స్ అని, మీరు కొనిచ్చిన ఆటో ఇక నుంచి నడపలేనని చెప్పి జ్వాల అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తరువాత ఏం జరిగింది? అన్నది తెలియాలంటే మంగళవారం ఎపిసోడ్ చూడాల్సిందే.