English | Telugu

Jayam serial : గంగని పెళ్ళి చేసుకొని ఇంటికి తీసుకొచ్చిన రుద్ర.. అడ్డుపడిన శకుంతల!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్- 120 లో.. పారు, హరి మాట్లాడుకుంటారు. ఇదంతా యాక్టింగ్ అని తెలియక పాపం రుద్ర గంగని ఎలా బయటకు తీసుకొని రావాలో ఆలోచిస్తూ ఉంటాడని నవ్వుకుంటారు. అప్పుడే రుద్ర ఎంట్రీ ఇస్తాడు. నాకు తెలుసు.. నువ్వు ఇదంతా పగకోసమే చేసావని.. గంగ దగ్గరికి వచ్చే ముందు నీ దగ్గరికి వచ్చాను.. నువ్వు మాట్లాడిన మాటలన్నీ విన్నానని రుద్ర అనగానే పారు షాక్ అవుతుంది. గంగని ఏ పరిస్థితిలో పెళ్లి చేసుకున్నానో .. నాకు తెలుసు.. ఇప్పుడు నువ్వు కేసు వెనక్కి తీసుకోకపోతే ఏం చెయ్యాలో నాకు తెలుసని రుద్ర చెప్పేసి అక్కడ నుండి వెళ్తాడు. రుద్ర వెళ్లేసరికి గంగని ఇన్‌స్పెక్టర్ వదిలేస్తాడు. ఏం చెప్పారు సర్ అని అడగ్గా.‌. ఆ హరి కేసు వెనక్కి తీసుకున్నాడని ఇన్‌స్పెక్టర్ అంటాడు.

ఎందుకు కేసు వెనక్కి తీసుకున్నావని పారుతో హరి అంటాడు. ఇదంతా యాక్టింగ్ అని రుద్రకి తెలిసింది. అది నిరూపిస్తే పోయేది నా పరువే అని పారు అంటుంది. మరొకవైపు గంగని జాగ్రత్తగా చూసుకోమని రుద్ర చేతిలో గంగని పెడుతుంది లక్ష్మీ. ఆ తర్వాత శకుంతల దగ్గరికి వచ్చి వీరు, ఇషిక మాట్లాడుతారు. మీరు ఆ పెళ్లిని ఒప్పుకోకండి అని శకుంతలతో చెప్తారు. పారు ఫోన్ చేస్తే వీరు, ఇషిక పక్కకి వచ్చి మాట్లాడుతారు. ఆ గంగని తీసుకొని రుద్ర మీ ఇంటికి వస్తున్నాడు.. తనని రానివ్వకుండా శకుంతల ఆంటీతో చెప్పండి అని పారు చెప్తుంది. ఇంత యాక్టింగ్ చేసిన వర్కవుట్ అవ్వలేదని పారు అంటుంది.

అంతలోనే గంగని తీసుకొని రుద్ర వస్తాడు. వాళ్ళని చూసి వీరు వెళ్లి శకుంతలకి చెప్తాడు. పెద్దసారు వాళ్లకు హారతి ఇచ్చి ఆహ్వానించమని ఇంట్లో వాళ్లకు చెప్తాడు. వాళ్ళు భయపడుతారు కానీ పెద్దసారు చెప్పడంతో ప్రీతి హారతి ఇస్తుంటే అప్పుడే ఆపండి అని శకుంతల ఎంట్రీ ఇస్తుంది. నాకు ఇష్టం లేదని తెలిసి కూడా మీరు హారతి ఇస్తున్నారా అని శకుంతల అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.