English | Telugu

అమర్ దీప్ కి ప్రశాంత్ అంటే పగా? లేక చిన్న చూపా?

బిగ్ బాస్ సీజన్-7 లో ఆటలతో కంటెస్టెంట్స్ మధ్య దూరం పెరుగుతుంది. ఫన్ గేమ్ అంటు ఓ వైపు బిగ్ బాస్ చిచ్చుపెడుతుంటే.‌ కంటెస్టెంట్స్ గెలవాలన్న ధీమాతో ఒకరినొకరు తిట్టుకుంటు, వారి మధ్య దూరం పెంచుకుంటున్నారు.

ఈ వారం మొత్తం ఫన్ టాస్క్ లు అంటు ఓట్ అప్పీల్ కోసం కంటెస్టెంట్స్ చేత కొత్త కొత్త గేమ్ లని ఆడిస్తున్న విషయం తెలిసిందే. అయితే అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ ల మధ్య గొడవ ఎంత వైరల్ అయిందో అందరికి తెలిసిందే. కాగా టాస్క్ మధ్యలో శివాజీ, ప్రశాంత్ మాట్లాడుకుంటున్నారు. " ఎందుకన్న నా మీద అమర్ అన్నకి అంత పగ" అని శివాజీకి ప్రశాంత్ చెప్పుకుంటూ బాధపడ్డాడు. అది పగ కాదురా భయం అంటూ శివాజీ కరెక్ట్‌గా చెప్పాడు. ఇక అమర్ అయితే ప్రశాంత్ గురించి శోభా, ప్రియాంకలకి తన వెర్షన్ చెప్పాడు. ఎదుటోడిని కన్ఫ్యూజ్ చేసి ఎలా టెంపర్‌మెంట్ లేపాలో వాడికి తెలిసినట్లుగా వేరే ఎవరికీ తెలీదంటూ అమర్ అన్నాడు.

అమర్ దీప్ కి నెగెటివిటి రావడానికి ప్రధాన కారణం ప్రియాంక, శోభాశెట్టికి సపోర్ట్ చేయాలని భావించి మిగిలిన హౌస్ మేట్స్ తో గొడవలకి దిగడం ఒకటైతే‌‌.‌ హౌస్ లోకి వచ్చిన నుండి కామన్ మ్యాన్ అని ప్రశాంత్ మీద ఒకరకమైన చిన్న చూపు అని అందరికి తెలిసిపోతుంది. ఇక ప్రతీసారీ టాస్క్ లలో పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేసి అరేయ్, ఒరేయ్ అంటాను నా ఇష్టం, ఇప్పుడు నేను కెప్టెన్ అని గర్వంగా మాట్లాడుతున్నాడు. ఇదంతా చూసే ప్రేక్షకులకు అమర్ దీప్ పై చిరాకేస్తుంటుంది. మరోవైపు శోభాశెట్టి చేసే పిచ్చి చేష్టలకి యావర్ట ట్రిగ్గర్ అవుతూ తన అగ్రెసివ్ ని బయటపెట్టుకుంటున్నాడు. దీంతో సీరియల్ బ్యాచ్ కి స్పై బ్యాచ్ కి మధ్య చిన్న గొడవలైన సీరియస్ గా మారుతున్నాయనే చెప్పాలి.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.