English | Telugu

సూర్య గారి పక్కన ఛాన్స్ వస్తే చేయాలని ఉంది!

జబర్దస్త్ కమెడియన్ వినోద్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఐతే కొన్ని నెలలుగా ఈ కామెడీ షోలో అయన కనిపించడం లేదు. అనారోగ్య కారణాల వలన కొంతకాలం బ్రేక్ తీసుకున్నారు.

ఇక ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో తన మనసులో ఉన్న మాటల్ని చెప్పారు. " జబర్దస్త్ అనేది సక్సెస్ ఫుల్ షో కాబట్టి దాని మీదే రూమర్స్ వస్తూ ఉంటాయి. ఐతే జబర్దస్త్ లోకి రావాలి అనుకుంటే వాళ్లకు టాలెంట్ ఉండాలి లక్ అనేది ఉండాలి. టాలెంట్ ని ప్రూవ్ చేసుకునే వాళ్ళు ముందుకెళ్తున్నారు లేని వాళ్ళు అక్కడే ఆగిపోతున్నారు. ఇక జబర్దస్త్ లో పేమెంట్ విషయానికి వస్తే పర్సనల్ గా ఎవరికీ పే చేయరు. టీంలీడర్ కి ఇస్తారు. టీం లీడర్ ఆ అమౌంట్ ని టీమ్ మెంబర్స్ కి షేర్ చేస్తాడు. ఇక షోస్ నుంచి చాలా మంది ఎందుకు వెళ్ళిపోతున్నారంటే మంచి ఆఫర్స్ రావడం వలన, కొంతమందికి ఆరోగ్యం సరిగా లేక ఎవరి పర్సనల్ ఇష్యూస్ తో వాళ్ళు వెళ్లిపోతున్నారు.

ఇక అందరిలోకి సుధీర్ అంటే ఎందుకు ఎక్కువ ఇష్టం అంటే అతను చాలా పద్దతిగా మాట్లాడతాడు. మంచిగా రిసీవ్ చేసుకుంటాడు. చిన్నప్పటినుంచి మా నాన్నకు స్టేజి షోస్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. నాకు మా సపోర్ట్ చాలా ఉంది. డాక్టర్ కావడం నా లక్ష్యం. మా అమ్మ కోరిక కూడా అదే ..నాకు ఎంసెట్ లో సీట్ వచ్చింది. అదే టైములో యాక్టింగ్ లో అవకాశం కూడా వచ్చింది. సూర్య గారి పక్కన చేయాలని ఒక డ్రీం అనేది ఉంది నాకు. "ఆకాశమే నీ హద్దురా" మూవీ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తూ చివరిలో ఒక సాంగ్ పాడి వినిపించాడు" జబర్దస్త్ కమెడియన్ వినోద్.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.