English | Telugu

ఎంటర్‌టైన్మెంట్ కి అడ్డా ఫిక్స్ అంటున్న కంటెస్టెంట్స్!

బిగ్ బాస్ అన్ని సీజన్లలోనూ ఈ సీజన్-6 బోరింగ్ అనే మాట ప్రతీ వారం వినిపిస్తుంది. కానీ ఈ వారం బిగ్ బాస్ చూసిన ప్రేక్షకులు మాత్రం కచ్చితంగా అలా అనరనే చెప్పాలి. ఎందుకంటే ప్రతీ కంటెస్టెంట్ తమ పర్ఫామెన్స్ తో బాగా ఎంటర్టైన్ చేస్తున్నారని చెప్పడంలో ఆశ్చర్యమే లేదు.

అయితే గత వారం నుండి జరుగుతున్న విన్నర్ ప్రైజ్ టాస్క్ లు అన్నీ కూడా చాలా ఎంటర్‌టైన్మెంట్ గా ఉన్నాయని ప్రేక్షకులు భావిస్తున్నారు. హౌస్ లో ఉన్న ఏడుగురు కూడా తమకిచ్చిన టాస్క్ లలో బాగా ఇన్వాల్వ్ అయ్యి, ది బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో కీర్తి, సత్యని కన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు బిగ్ బాస్. చీకటి గదిలో వాళ్ళకి భయాన్ని దగ్గర నుండి చూపించాడు బిగ్ బాస్. అయితే అలా భయపడటం చూసేవాళ్ళకి వినోదాన్ని పంచింది. ఇంకా లాస్ట్ లో బిగ్ బాస్, కంటెస్టెంట్స్ అందరినీ ఒకేసారి కన్ఫెషన్ రూంకి పిలవగా, అందరూ భయంతో గందరగోళం చేసారు. వీళ్ళందరి భయంతో కూడిన పర్ఫామెన్స్ వినోదాన్ని పంచింది. ఇంకా ఆ తర్వాత కంటెస్టెంట్స్ చేసిన రోల్ ప్లే టాస్క్ లో.. ఇప్పటివరకు హౌస్ లో జరిగిన గొడవలు, అందరికి గుర్తుండిపోయిన సంఘటనలు మళ్ళీ చేసి చూపించమన్నాడు బిగ్ బాస్. అయితే ఎవరి రోల్ వారికి ఇవ్వకుండ క్యారెక్టర్ మార్చి ఇవ్వగా, అందరూ కూడా బాగా చేసారు.

శ్రీహాన్, ఇనయాల మధ్యలో జరిగిన పిట్ట గొడవను.. అర్జున్ రేవంత్ మధ్యలో పప్పు గొడవను.. ఆదిరెడ్డి సీక్రెట్ టాస్క్.. ఇంకా రోహిత్, రేవంత్ ల గొడవ. వీటికి సంబంధించిన రోల్ ప్లే బాగా చేసారు. ఆ తర్వాత "కంటెస్టెంట్స్ రోల్ ప్లే బాగా చేసి నాకు వినోదాన్ని అందించారు" అంటూ బిగ్ బాస్ మెచ్చుకున్నాడు. ఆ తర్వాత విన్నింగ్ ప్రైజ్ మనీ అమౌంట్ 47 లక్షలుగా ఉందని అనడంతో కంటెస్టెంట్స్ అందరు సంతోషపడ్డారు. అయితే ఈ టాస్క్ లో రోహిత్, శ్రీసత్య బాగా పర్ఫామెన్స్ చేసారంటూ ప్రేక్షకులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.