English | Telugu

Guppedantha Manasu : ఎండీ పదవి వద్దని చెప్పిన మను.. షాక్ లో మినిస్టర్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1127 లో..... దేవయాని చేస్తున్న బ్లాక్ మెయిల్ కి అనుపమ బయపడి తన పెద్దమ్మ దగ్గరకి వస్తుంది. కాసేపటికి మనుని రమ్మని చెప్తుంది. మను వచ్చాక ఇక మనం ఇక్కడే ఉండాలని అనుపమ అనగానే.. ఎందుకు? ఏం జరిగిందని మను అడుగుతాడు. ఏం లేదు ప్లీజ్ నేను చెప్పింది విను అని అనుపమ అనగానే.. ఏదో జరిగింది దాస్తున్నారు చెప్పండి అని మను అంటాడు.‌ మీరు ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి.. నా తండ్రి ఎవరో చెప్పండి.. లేదంటే ఈ గన్ తో షూట్ చేసుకుంటానని మను తన తల దగ్గర గన్ పెట్టుకుంటాడు.

ఆ తర్వాత వద్దని అనుపమ అంటుంది. అప్పుడే మహేంద్ర వచ్చి గన్ ని లాక్కుంటాడు.అసలు ఏమైంది? ఎవరైనా ఏమైనా అన్నారా అని మహేంద్ర అడుగుతాడు. ప్లీజ్ మహేంద్ర మన ఫ్రెండ్ షిప్ పై గౌరవం ఉంటే ఏం అనకని అనుపమ అంటుంది. ఆ తర్వాత మహేంద్ర వెళ్ళిపోయాక.. నీకు నన్ను అమ్మ అని పిలవాలని ఉంది కదా.. నీకు ఎంతుందో నిన్ను అమ్మ అని పిలిపించుకోవాలని నాకు అంతకు పది రేట్లు ఉందని అనుపమ అంటుంది. అమ్మ అని పిలుపు అనగానే.. మను అమ్మ అని పిలిస్తూ ఎమోషనల్ అవుతాడు. నేను చెప్పినట్టు విను మనం ఇక్కడే ఉందాం.. కాలేజీలో కూడ నువ్వు జోక్యం చేసుకోకని అనుపమ అనగానే.. మను సరే అంటాడు. మరొకవైపు రంగా నానమ్మ రాధమ్మ కిందపడిపోతుంది. అప్పుడే వసుధార వచ్చి హెల్ప్ చేస్తుంది. రంగా వస్తాడు. అప్పటికే డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ ఇస్తుంది. టైమ్ కి ఎవరు హెల్ప్ చేసి కాపాడారని డాక్టర్ అంటుంది. ఆ తర్వాత రంగా ఎమోషనల్ అవుతూ వసుధారకి థాంక్స్ చెప్తాడు. ఏంటి సర్ ఇంత ఎమోషనల్ అవుతున్నాడు. రిషి సర్ కాదా నిజంగానే రంగానా అని అనుకొని.. లేదు నా రిషి సర్ అని వసుధార అనుకుంటుంది.

ఆ తర్వాత మినిస్టర్ గారు కాలేజీ లో బోర్డు మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. ఇప్పుడు ఎందుకు మీటింగ్ ఏర్పాటు చేసానో తెలుసా అని ఎండీ చైర్ గురించి అని మాట్లాడతాడు. నాకు ఈ కాలేజీకి ఎండీ గా మను ఉంటే బాగుంటుందని నిర్ణయం తీసుకున్నానని మినిస్టర్ అనగానే.. మీరే నిర్ణయం తీసుకుంటే ఎలా అని శైలేంద్ర ఆవేశపడుతుంటే.. ఫణీంద్ర తనపై కోప్పడతాడు.ఆ తర్వాత మనునే ఎండీ అని మినిస్టర్ అనగానే.. అందుకు నేను సిద్దంగా లేనని మను అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.