Read more!

English | Telugu

ఎవ్వరైనా సరే ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో లెక్కపెట్టగలరా!?

అష్షు రెడ్డి గురించి సోషల్ మీడియా ఎక్కువగా ఫాలో అయ్యేవాళ్ళకు బాగా తెలుసు.సమంత పోలికలు ఉండేసరికి అష్షుని జూనియర్ సమంత అనడం స్టార్ట్ చేశారు ఫాన్స్. అలా సోషల్ మీడియాలో తానూ ఫుల్ ఫేమస్ ఐపోయింది. ఇక ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసి, బిగ్ బాస్ కి వెళ్లొచ్చి ఇంక పాపులారిటీని తెచ్చుకుంది. 

అషు రెడ్డి గురించి సోషల్ మీడియా ఎక్కువగా ఫాలో అయ్యేవాళ్ళకు బాగా తెలుసు. సమంత పోలికలు ఉండేసరికి అష్షుని జూనియర్ సమంత అనడం స్టార్ట్ చేశారు ఫ్యాన్స్. అలా సోషల్ మీడియాలో తానూ ఫుల్ ఫేమస్ ఐపోయింది. ఇక ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసి, బిగ్ బాస్ కి వెళ్లొచ్చి మ‌రింత‌ పాపులారిటీని తెచ్చుకుంది. 

ఇన్స్టాగ్రామ్ పేజీ చూస్తే గనక అందులో మొత్తం అష్షు హాట్ పిక్స్ మాత్రమే కనిపిస్తాయి. ఎప్పుడో కానీ చీరకట్టులో కనిపిస్తుంది. ఇటీవలి కాలంలో  ఈమె పోస్ట్ చేస్తున్న హాట్ పిక్స్ మస్త్ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు తన పేజీలో వేర్వేరు యాంగిల్స్ లో ఫొటోస్ పోస్ట్ చేసి "ఇప్పుడు పోస్ట్ చేసిన ఈ ఫొటోలో ఎవ్వరైనా సరే ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో లెక్కపెట్టగలరా" అంటూ టాగ్ లైన్ పెట్టి నెటిజన్స్ కి కొంటె సవాల్ విసిరింది.

నెటిజెన్స్ ఊరుకుంటారా! "పుట్టుమచ్చలు లెక్కపెడితే మాకేం వస్తది, టైం వేస్ట్ తప్ప" అని ఒకరు, "మీరు చాల బాగుంటారు. కొంచెం ట్రెడిషనల్ గా రెడీ అవ్వొచ్చు కదా. ఇలాంటి గాలి డ్రెస్సింగ్ స్టైల్ లో ఫొటోస్ ఎందుకు" అని ఒకరు, "మీ నుదురు ఎక్కువగా కనిపిస్తోంది హెయిర్ స్టైల్ చేంజ్ చేయండి" అని మరొకరు కామెంట్స్ పోస్ట్ చేశారు.

అలాగే అషు బర్త్ డే ఫొటోస్ ని, అరియనా గ్లోరీ తో కలిసి దిగిన ఫొటోస్ తన ఇన్స్టాస్టేటస్ లో పోస్ట్ చేసుకుంది అష్షు.