English | Telugu

వంటలక్కా.. మాజాకా ..1500 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న కార్తీకదీపం..కేక్ కట్ చేసి సంబరాలు

బుల్లితెర సీరియల్స్ లో కింగ్ ఆఫ్ సీరియల్ గా పేరు తెచ్చుకుంది కార్తీకదీపం. ఒకప్పుడు ఋతురాగాలు సీరియల్ కోసం ఆడియన్స్ ఎంత తపించేవారో మళ్ళీ ఇప్పుడు కార్తీక దీపం సీరియల్ కోసం అంత తపిస్తున్నారు. ఈ సీరియల్ రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే. 2017 అక్టోబర్ 16న కార్తీకదీపం సీరియల్ మొదటి ఎపిసోడ్ ప్రసారమైంది. ఐదేళ్లుగా ఈ సీరియల్ నంబర్ వన్ పొజిషన్ లో దూసుకుపోతూ ఉంది. మధ్యలో కొన్నిసార్లు రేటింగ్స్ తగ్గినా మళ్ళీ కొత్త రేటింగ్స్ వచ్చేసరికి అది కవర్ ఐపోయేది. ఇక దీప, డాక్టర్ బాబు రోల్స్ ని ఇంట్లో వాళ్ళలా ఫీల్ అయ్యే ఆడియన్స్ కూడా చాలామంది ఉన్నారు. లేడీ విలన్ మోనితను ఒక రేంజ్ లో తిట్టుకుంటూ ఉంటారు ఆడియన్స్.

మధ్యలో కొంత కాలం డాక్టర్ బాబు, వంటలక్కని చంపేసరికి రేటింగ్స్ అన్నీ పడిపోయాయి. దీంతో రైటర్ మళ్ళీ ఈ రెండు క్యారెక్టర్స్ ని సీరియల్ లోకి రప్పించేసరికి ఇక ఈ సీరియల్ కి పూర్వ వైభవం వచ్చేసింది. ఇక ఇప్పుడు కార్తీక దీపం సీరియల్ మరో అరుదైన మైలురాయిని దాటింది. అదే 1500 ఎపిసోడ్ పూర్తి చేసుకుంది. దీంతో వంటలక్క 15వ సెంచరీ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిందంటున్నారు ఆమె ఫాన్స్. ఐదేళ్ల ప్రయాణాన్ని ఎంతో సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న కార్తీకదీపం ఫ్యూచర్ లో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఈ సీరియల్ 1500 ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్నందుకు టీం మొత్తం కేక్ కట్ చేసి పండగ చేసుకున్నారు. ఇక ఈ వీడియోస్ అన్నీ వంటలక్క, డాక్టర్ బాబు తమ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో పోస్ట్ చేసుకున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.